ఫిర్యాదుల పట్ల వెంటనే స్పందించి చట్టప్రకారం చర్యలు చేపట్టాలి.. జిల్లా ఎస్పీ

జోగులాంబ గద్వాల 24 ఫిబ్రవరి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల .:-బాధితుల నుండి వచ్చిన ఫిర్యాదుల పట్ల వెంటనే స్పందించి చట్టప్రకారం చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు పోలీస్ అధికారులను ఆదేశించారు.సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 10 మంది బాధితుల ఫిర్యాదులను జిల్లా ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.భూ వివాదాలకు సంబందించిన పిర్యాదులు , కొడుకులు తల్లిదండ్రులు లను చూడక పోవడం, అన్నదమ్ముల మధ్య బాగా పరిష్కార పిర్యాదులు, లైంగిక వేధింపులకు సంబంధించిన పిర్యాదులు మరియు భర్త వేదింపులకు సంబంధించిన ఫిర్యాదులను అయన పరిశీలించారు.ఫిర్యాదులపై క్షేత్రస్దాయిలో విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకొవాలని సంబంధిత ఎస్సై,సీ.ఐ లను జిల్లా ఎస్పీ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డి.ఎస్పి శ్రీ వై.మోగిలయ్య పాల్గొన్నారు.