పల్లె దావఖాన ప్రారంభించండి

Jul 29, 2025 - 19:51
 0  8
పల్లె దావఖాన ప్రారంభించండి

చర్ల 29 -7- 25

ప్రజల ప్రాణాలను రక్షించండి .

--సిపిఎం డిమాండ్ 

మారుమూల ఏజెన్సీ, ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర సరిహద్దు గ్రామం కుర్నపల్లి లో సిపిఎం జిల్లా కార్యదర్శి పర్యటన,

సమస్యల నిలయం గా ఏజెన్సీ గ్రామాలు,

వైద్యం, మంచినీటి సమస్యతో అలమటిస్తున్న ఆదివాసీలు,

డెంగీ, మలేరియా తో ఆసుపత్రి పాలయిన గిరిజనులు.

 దవాఖానా ప్రారంభించి ప్రజల ప్రాణాలు కాపాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, మంగళవారం నాడు చర్ల మండలం లో మారుమూల ఏజెన్సీ గ్రామాలైన కుర్నపల్లి,గిరిజన గ్రామం లో సిపిఎం జిల్లా నాయకుల విస్తృత పర్యటన నిర్వహించారు , ఏజెన్సీ గ్రామాల్లో కోకొల్లలుగా ప్రజా సమస్యలు ఉన్నాయని ఆయన అన్నారు, సమస్యలు పట్టించుకోకపోవడంతో సమస్యలు పేరుకుపోయాయన్నారు,సిపిఎం మారుమూల గిరిజన గ్రామమైన కుర్నపల్లిలో నిర్మించిన పల్లె దవాఖానా నూతన భవనాన్ని వెంటనే ప్రారంభించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు ,మారుమూల ఏజెన్సీ గిరిజన గ్రామాల్లో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు సిపిఎం జిల్లా నాయకత్వం మరియు చర్ల మండల నాయకత్వం పర్యటించారు , పల్లె దవాఖానా భవనం నిర్మించి మూడు సంవత్సరాలు అవుతున్నప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదని తెలిపారు, మరోవైపు గిరిజన గ్రామాల్లో మలేరియా , డెంగీ మరియు వైరల్ జ్వరాలు విస్తృతంగా ఉన్నాయని వీటి నియంత్రణకు వైద్య సేవలను మెరుగుపరిచి ప్రజల ప్రాణాలను కాపాడాలని సిపిఎం డిమాండ్ చేసింది, గ్రామ పంచాయతీలకు పాలన ముగిసినప్పటినుంచి అధికారుల పాలనలో నడుస్తున్నాయని ,దాదాపు 22 నెలలుగా గ్రామాల్లో పారిశుధ్య పనులు పడకేశాయని సిపిఎం పరిశీలనలో ప్రజల ప్రజలు సమస్యలను వెల్లబోశారు, కనీసం రాత్రి పూట వీధిలైట్లు కూడా వేసే పరిస్థితి లేదని ,వర్షాలకి వీధులన్నీ బురదమయమై విపరీతంగా దోమలు వస్తున్నాయని బ్లీచింగ్ పౌడర్ చల్లే స్థితి కూడా లేదని దోమల మందు కూడా పిచికారి చేయించడం లేదని ప్రజలు వాపోయారు ,ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని సిపిఎం డిమాండ్ చేసింది, కుర్నపల్లి రాంచంద్రాపురం మధ్య గుండ్ల వాగు పై వంతెన నిర్మాణం చేపట్టాలని సిపిఎం డిమాండ్ చేసింది ఈ వంతెన నిర్మాణానికి ఫారెస్ట్ శాఖ అనుమతులు లేవనే పేరుతో నిర్మాణ పనులు ప్రారంభించలేదని ఫలితంగా వ్యవసాయ పొలాలకు వెళ్లే రైతులు కుర్నపల్లి ,రామచంద్రపురం బత్తెనపల్లి, తిప్పాపురం వెళ్ళవలసిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు,వర్షాలకు వాగు పడితే ఆ గ్రామాలకు వెళ్లి పాఠాలు బోధించవలసిన టీచర్లు కూడా పాఠశాలకు వెళ్లే పరిస్థితి లేదని ఆదివాసి ప్రజలు సిపిఎం నాయకత్వం ముందు తమ సమస్యల గోడును వినిపించారు , అదేవిధంగా గిరిజన గ్రామాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం సవితి తల్లి ప్రేమను ప్రదర్శిస్తుందని విమర్శించారు, కుర్నపల్లి వద్ద గుండ్ల వాగుపై బ్రిడ్జిని నిర్మించాలని అలాగే నిర్మిస్తే 1000 ఎకరాల వరకు సాగునీరు అందించే అవకాశం ఉంటుందని అతి తక్కువ ఖర్చుతోటి గిరిజన గ్రామాల ప్రజలకు సాగునీరు అందుబాటులోకి వస్తుందని సిపిఎం తెలిపింది ,గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు పదవులు,పంపకాల్లోనూ అక్రమ ఇసుక దందాలలోను మద్యం దందాలలోనూ లాభాల వాటాల కోసం కొట్లాడుతున్నారని సిపిఎం విమర్శించింది, ప్రజా సమస్యల పట్టించుకోని కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులను గ్రామ గ్రామాన నిలదీయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు, ప్రజలు చెప్పిన సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ కృషి చేస్తుందని తెలిపారు గ్రామంలో పారిశుధ్య పనులు వీధిలైట్లు తదితర సమస్యలపై గ్రామపంచాయతీ కార్యదర్శి సైదులు దృష్టికి సమస్యలను తీసుకెళ్లారు దీనిపై స్పందించిన పంచాయతీ కార్యదర్శి నిధులు లేని కారణంగా తాము ఏ పని చేయలేని పరిస్థితి ఏర్పడిందని వాపోయారు కనీసం మిషన్ భగీరథ మంచినీళ్ల సరఫరా కూడా జరగటం లేదని ఆదివాసీ ప్రజలు గుక్కెడు నీళ్లకు కూడా నోచుకోని దుస్థితి ఏర్పడిందని దీనికి ప్రజా ప్రతినిధి యొక్క అసమర్ధతే కారణమని సిపిఎం విమర్శించింది ఈ సమస్యలన్నింటిపైన ఐటీడీఏ పీవోకు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాలు అందజేస్తామని తెలిపారు,వారు స్పందించి సమస్యలు పరిష్కారం చేయకపోతే ప్రత్యక్ష పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు, సిపిఎం నాయకత్వంలో పోరాటాలకి ఆదివాసి ప్రజలు సమాయత్తం కావాలని విజ్ఞప్తి చేశారు, ఈ పర్యటనలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే బ్రహ్మచారి ,రేపాకుల శ్రీనివాస్, మండల కార్యదర్శి మచ్చ రామారావు, మండల కమిటీ సభ్యులు కారం నరేష్ ,పి సమ్మక్క ,బందెల చంటి ,దొడ్డి హరినాగ వర్మ ,నవీన్, షారోని వరలక్ష్మి ,కుర్నపల్లి పంచాయతీ సిపిఎం నాయకులు ఇర్ఫా నాగేశ్వరావు ,కుంజ రాజబాబు ,తదితరులు పాల్గొన్నారు