తొండ గ్రామంలో రైతులు హర్షం

తిరుమలగిరి 27 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
వరి ధాన్యం అమ్మిన 48గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి రైతుల ఖాతాలోకి డబ్బులు జమ కావడంతో తిరుమలగిరి మండలం తొండ గ్రామ రైతులు కన్నబోయిన ఉమేష్, గొడుగు సోమనారాయణ, పల్లెర నరసయ్య, నర్సయ్య, సారి కొల్ల ఐలమల్లు, జంపాల సత్తయ్య హర్షం వ్యక్తం చేశారు ఈసందర్భం గా పాత్రికేయులతో పలువురు రైతులు మాట్లాడుతూ . గత ప్రభుత్వం రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసి నెలల తరబడి వారికి డబ్బులు చెల్లించకుండా నానాఇబ్బందుల పాలు చేసిందని, అలాకాకుండా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభు త్వం రైతుల వద్ద కొనుగోలు చేసిన 48గంటల్లో వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరుగు తుందని స్పష్టంచేశారు. అదేవిధం గా కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు ముక్కరి మహేష్ మాట్లాడుతూ సన్నవరి ధాన్యానికి గతంలో ప్రకటించన ట్లుగా ప్రతి క్వింటాకు రూ.500 బోనస్ కూడా వెంటనే జమచేయడం జరుగుతుందని పేర్కొన్నా రు. రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులకు భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐకెపి నిర్వాహకులు తెరాటి వెంకన్న వేల్పుల సంధ్య రైతులు ప్రజలు తదితరులు ఉన్నారు