టీఎస్ సీపీడీసీఎల్ సిఎండి పదవిని దళితులకు కేటాయించాలి
టిఎస్ సీపీడీసీఎల్ సీఎండి పదవిని దళితులకు కేటాయించాలి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు సూరయ్య డిమాండ్
తెలంగాణ వార్త 27.10.2024.సూర్యాపేట ప్రతినిధి:- తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీఎస్ సీపీడీసీఎల్ సీఎండి పదవిని దళితులకు కేటాయించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు కొండగడుపుల సూరయ్య డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన పత్రిక,విలేకరుల సమావేశంలో ,మాట్లాడారు. గత ప్రభుత్వాలు దళితులకు పెద్దపీట వేశాయని అదే కోవలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దళితులకు సీపీడీసీఎల్ సీఎండి పదవి ఇవ్వాలన్నారు. దళితుల్లో ఎంతో మంది డైనమిక్ ఇంజనీర్లు ఉన్నారని వారికి సీఎండి పదవి ఇస్తే సంస్థను మరింత అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందన్నారు. కొన్ని వర్గాలకు కొన్ని పదవులు కేటాయించినట్లుగా మా దళిత వర్గానికి ఈ పదవి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. మూసీ ప్రక్షాళనకు హైడ్రాకు ఎదురెళ్ళడాన్ని ప్రజలంతా హర్షిస్తున్నారని డైనమిక్ సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఎవరు ఎదురొచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనక్కు తగ్గకుండా హైడ్రాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నరని అన్నారు. ఎన్నో సమస్యలతో సచివాలయంకు వస్తున్న ప్రజల సమస్యలను ప్రతి ఒక్కటి పరిష్కరిస్తున్నారని అన్నారు. అలాగే మా దళితులకు గతంలో చంద్రబాబు ప్రభుత్వం కేటాయించినట్లుగా టీఎస్ సీపీడీసీఎల్ సీఎండి పదవిని కేటాయించాలని కోరారు.