జ్యోతిష్కుడు చెప్పాడని కొడుకుని చంపిన తండ్రి

Jul 11, 2026 - 20:28
 0  0
జ్యోతిష్కుడు చెప్పాడని కొడుకుని చంపిన తండ్రి

తమిళనాడులో జ్యోతిష్కుడు చెప్పిన మాటలను నమ్మిన ఓ తండ్రి తన కుమారుడిని హత్య చేసిన కేసును పోలీసులు ఛేదించారు. తేని జిల్లాకు చెందిన వేందర్ బాలాకు, తన కుమారుడు శ్రీకాంత్ వల్ల తన ప్రాణాలకు ప్రమాదం ఉందని జ్యోతిష్కుడు చెప్పడంతో 2023లో స్నేహితుల సహాయంతో అతడిని గొంతునులిమి హత్య చేసినట్లు విచారణలో అంగీకరించాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా నరికి ముల్లైపెరియార్ నదిలో పడేసినట్లు వెల్లడించాడు. శ్రీకాంత్ అదృశ్యంపై తల్లి దాఖలు చేసిన పిటిషన్తో కేసు సీబీసీఐడీకి వెళ్లగా, మూడేళ్ల తర్వాత అసలు విషయం బయటపడింది.

ప్రధాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333