జర్నలిస్ట్ యోగి రెడ్డికి కొవ్వతులతో నివాళులర్పించిన TSJA జర్నలిస్టు లు

వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వాలు అన్ని రకాలుగా భరోసా కల్పించాలి

Aug 12, 2024 - 21:03
Aug 12, 2024 - 21:30
 0  18
జర్నలిస్ట్ యోగి రెడ్డికి కొవ్వతులతో నివాళులర్పించిన TSJA జర్నలిస్టు లు

జర్నలిస్టు యోగి రెడ్డికి కొవ్వొత్తులతో నివాళులర్పించిన టీఎస్ జేఏ జర్నలిస్టులు

సూర్యాపేట 12 ఆగస్టు 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- గత శుక్రవారం వరంగల్ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న జర్నలిస్టు యోగి రెడ్డికి సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ నాయకులు స్థానిక ఖమ్మం ఎక్స్ రోడ్డులో గల అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి మాట్లాడుతూ.సమాజ శ్రేయస్సులో జర్నలిస్టు పాత్ర అత్యంత కీలకమని, ప్రభుత్వానికి ప్రజలకు వారధులుగా పని చేసే జర్నలిస్టులు నేడు ఆర్థికంగా,మానసికంగా నలిగిపోతున్నారన్నారు.

యోగి రెడ్డి ఆర్థిక ఇబ్బందులతో కుమార్తె తో సహా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ప్రభుత్వాలకు కనువిప్పు తీసుకురావాల్సింది అని పేర్కొన్నారు.సమాజ హితం కోసం పోరాడే జర్నలిస్టులు సమస్యలను ధీటుగా ఎదుర్కోవాలని, సూచించారు.ప్రభుత్వం యోగి కుటుంబానికి అండగా నిలవాలని, వారి కుటుంబాన్ని ఆదుకోవాలని అన్నారు.యాజమాన్యాల టార్గెట్లు, ఫీల్డ్ మీద ఇబ్బందులు ఇలా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎలాంటి వేతనాలు లేకుండా సేవ చేస్తున్న జర్నలిస్టులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు జర్నలిస్టులందరికీ ఇల్లు, హెల్త్, బస్ పాస్, పోలీస్ భరోసా కార్డులు,రైల్వే పాస్, ఉచిత విద్యుత్తు ఉచిత గ్యాస్ రోజుకు లీటర్ పెట్రోల్,ప్రయివేటు పాఠశాలలు కళాశాలల్లో రాష్టంలోని ఏ ప్రాంతంలో అయిన రాయితీ కల్పించాలని కోరారు.ప్రజల సమస్యలు ప్రభుత్వానికి నివేదిస్తూ, ప్రభుత్వ పాలన దక్షితను ప్రజల్లోకి తీసుకెళ్తూ వారధులుగా పని చేస్తూ కుటుంబాలకు దూరంగా ఉంటున్న జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ధూపాడి శ్యాంబాబు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దుర్గం బాలు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రఘువరన్ ఆచార్యులు పిన్నెల్లి వెంకటేష్,సూర్యాపేట నియోజకవర్గ నాయకులు తాప్సీ అనిల్ దేశ గాని వెంకట్ గౌడ్ వల్డాసు శంకర్ తదితరులు పాల్గొన్నారు

Shake Jaheer Staff Reporter Suryapet District Telangana 508223