చేయూత ఫౌండేషన్ మరియు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం
చేయూత ఫౌండేషన్ మరియు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం
ఆగస్ట్ 6 భద్రాది కొత్తగూడెం తెలంగాణ వార్త:- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో ఆళ్ళపల్లి మండలం లో మొదటి సారిగా మెగా రక్తదాన శిబిరం ఈ సందర్భంగా మండల సీనియర్ పాత్రికేయుల సంఘం అధ్యక్షులు బిక్షం, కార్యదర్శి శేఖర్ మాట్లాడుతూ.. రక్తహీనతతో బాధపడే చిన్న పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు, ప్రమాదాలకు గురైన వ్యక్తులకు రక్తం సకాలంలో అందలేక అనేక ప్రాణాలు కోల్పోతున్నారు అనే సదుద్దేశంతో మండల కేంద్రంలోని రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. చిడెం సాయి ప్రకాష్ నేతృత్వంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఆళ్లపల్లి మండల సీనియర్ పాత్రికేయుల ప్రత్యేక దృష్టి పెట్టి ,అన్ని దానాల కంటే రక్తదానం ఎంతో గొప్పదని సాటి మనిషి ప్రాణాలను కాపాడుతుందని గ్రహించి మండలంలో ప్రధమంగా రక్తదానం నిర్వహించడంతో అనుకున్న దాని కంటే రెట్టింపుగా యువకులు అధికారులు ఉద్యోగులు సైతం ముందుకు వచ్చి సుమారుగా నాలుగు పదుల సంఖ్యలో రక్తదానాన్ని ఇచ్చారు మండల వ్యాప్తంగా ఆరోగ్యశాఖ, పోలీస్ శాఖ, టీచర్లు, వ్యాపారులు, గ్రామీణ వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పాత్రికేయులు సైతం రక్తం దానంతో మండల ప్రజల్ని చైతన్యవంతులుగా చేశారు.
ఏదేమైనా ప్రథమంగా మండల కేంద్రంలో రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎస్సై రతిష్ ప్రభుత్వ వైద్యులు రేవంత్, ఎమ్మార్వో శకుంతల,ఎంపీడీవో దీరావత్ శ్రీను, ఎంపీఓ బత్తిని శ్రీనివాసరావు, హెచ్ఎం శాంతయ్య, ప్రకృతి ప్రేమికుడు పాషా, గ్రామీణ వైద్యుల అధ్యక్షుడు నయుం, మాజీ ఎంపీపీ పాపారావు, ఎర్రయ్య, పాత్రికేయులు గ్రామీణ వైద్యులు తదితరులు పాల్గొన్నారు.