గుట్టను తోడేస్తారు ఆపండి....

మైనింగ్ పర్మిషన్ రద్దు చేయాలని గ్రామస్తులు ఆందోళన
తిరుమలగిరి 06 మార్చి 2025 తెలంగాణ వార్త రిపోర్టర్ :- తిరుమలగిరి మండలం తొండ గ్రామ పంచాయతీలో సర్వే నెంబర్ 98 లో మైనింగ్ పర్మిషన్ రద్దు చేయాలని కోరుతూ బుధ వారం నాడు గ్రామస్తులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ ఇదే సర్వే నెంబర్ 98 గతంలో పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డ్, రైతు వేదిక, క్రీడా ప్రాణాంగము ఏర్పాటు చేశారని , ఇటీవల తుంగతుర్తి నియోజకవర్గం లో తెలంగాణ రాష్ట్ర ఇంటిగ్రేటెడ్ స్కూల్ 330 కోట్ల రూపాయలతో మంజూరైనది. ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ఇక్కడ మైనింగ్ పర్మిషన్ ఇస్తే పర్యావరణo, పక్కనే ఉన్న రైతు వేదిక, క్రీడా ప్రాణంగాము, పల్లె ప్రకృతి వనము, త్వరలో నిర్మించ బోయే ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవనాలు దెబ్బతింటాయని గ్రామస్తులు పేర్కొన్నారు. అవసరమైతే మైనింగ్ వారు గ్రామపంచాయతీకి పన్ను కట్టాల్సిన రూపాయలు మా గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం నుండి 1000 గాని ₹2,000 గాని వసూలు చేసి గ్రామపంచాయతీకి డెవలప్ కు చెల్లిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ మా గ్రామానికి తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరు చేసినందుకు మా గ్రామస్తులు కృతజ్ఞతలు తెలుపుతూ ఇప్పుడున్న లెక్క ప్రకారం 25 ఎకరాలలో నిర్మిస్తున్నారు.కానీ భవిష్యత్తులో 50 ఎకరాల వరకు ఈ పాఠశాల నిర్మించవచ్చు ఈ మైనింగ్ వల్ల పాఠశాల భవిష్యత్తులో డెవలప్మెంట్ కాదని అందుకు స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్, పార్లమెంటు సభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి మా గ్రామ ప్రజల మీద ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనుల మీద గమనించి ఈ మైనింగ్ పర్మిషన్ ను రద్దు చేయగలరని గ్రామస్తులు ఆందోళన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మల్లయ్య, బంగారి రాజు, నరేష్, ఏలుపుల వెంకన్న హరీష్, సోమనారాయణ, ఎలుపుల వెంకటయ్య, ఇరసరాపు రవి, పోరెల్ల లక్ష్మయ్య, రామ్ కుమార్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.