క్రీడల్లో బ్రైట్ స్టార్ స్కూల్ విద్యార్థుల ఘన విజయ

Sep 28, 2026 - 19:54
 0  0
క్రీడల్లో బ్రైట్ స్టార్ స్కూల్ విద్యార్థుల ఘన విజయ

 జోగులాంబ గద్వాల 28 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి :  జిల్లా స్థాయికి ఎంపిక స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో చిన్న తాండపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అండర్ 14 ఇయర్స్ బాయ్స్ విభాగం లో ఖో ఖో లో మొదటి బహుమతి  మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మేడికొండ లో అండర్ 17 ఇయర్స్ బాయ్స్ విభాగం ఖో ఖో లో మొదటి బహుమతి  సాధించి  మండల స్థాయి క్రీడా పోటీలలో బ్రైట్ స్టార్ స్కూల్ (Bright Star School) విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను కనబరిచి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నారు. మండల స్థాయిలో అత్యుత్తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించిన ఈ విద్యార్థులు తదుపరి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అభినందన సభలో పాఠశాల కరస్పాండెంట్ జె.పి. ఎస్తేర్ , అకాడమిక్ డైరెక్టర్ పి. దివ్య జ్యోతి  విజేతలైన విద్యార్థులను, వారిని తీర్చిదిద్దిన వ్యాయామ ఉపాధ్యాయులను (PET) అభినందనలు తెలియజేశారు  ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ జె.పి. ఎస్తేర్ మాట్లాడుతూ — "చదువుతో పాటు క్రీడలు కూడా విద్యార్థుల మానసిక, శారీరక వికాసానికి ఎంతగానో తోడ్పడతాయి. మా పాఠశాల విద్యార్థులు మండల స్థాయిలో ప్రథమ స్థానం సాధించడం చాలా గర్వకారణంగా ఉంది. జిల్లా స్థాయిలో కూడా ఇదే రకమైన ప్రతిభను చాటి పాఠశాలకు, మండలానికి మంచి పేరు తీసుకురావాలి" అని ఆకాంక్షించారు. పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ పి. దివ్య జ్యోతి  మాట్లాడుతూ — "క్రీడల్లో గెలుపోటముల కంటే భాగస్వామ్యం, క్రమశిక్షణ చాలా ముఖ్యం. జిల్లా స్థాయికి సెలెక్ట్ అయిన విద్యార్థులందరికీ మా శుభాకాంక్షలు" అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు (PET), విద్యార్థులు  పాల్గొని విజేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333