కాకతీయ విద్యా సంస్థల ఆధ్వర్యంలో సౌత్ ఇండియా ప్రెస్టేజ్ రోబోటిక్స్ ఎక్స్పో
నిజామాబాద్, 30 మార్చి 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గల కాకతీయ విద్యా శనివారం, ఆదివారం టెక్రోనిక 2024 కార్యక్రమాన్ని రెండో రోజులపాటు నిర్వహిస్తున్నట్లు కాకతీయల విద్యాసంస్థల డైరెక్టర్ రామోజీరావు తెలిపారు.నగరంలోని శ్రీరామ గార్డెన్స్ లో రెండు రోజులపాటు రోబోటిక్స్ ఎక్స్ ప్రో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో కాకతీయ విద్యా సంస్థలకు చెందిన సుభాష్ నగర్ బ్రాంచ్ మరియు ప్రగతి నగర్ బ్రాంచ్ విద్యార్థిని విద్యార్థులు వివిధ రోబోటిక్స్ ప్రయోగాలను,ప్రదర్శించారు.
ఈ సౌత్ ఇండియా ప్రెస్టేజ్ రోబోటిక్స్ ఎక్స్ ప్రో కార్యక్రమానికి భారీ స్పందన లభించింది.ఎంతో హుషారుగా విద్యార్థులు తమ ఆవిష్కరించిన రోబోటిక్స్ ఎక్స్పో ప్రదర్శనను ప్రదర్శించారు.మరియు భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా వివిధ రకాలైనటువంటి రోబోటిక్స్ ఎక్స్పో ఆవిష్కరణ కాకతీయ ఒలంపియాడ్ స్కూల్ విద్యార్థులు ప్రదర్శించారు.ఈ సందర్భంగా కాకతీయ సంస్థల డైరెక్టర్ రామోజీరావు మాట్లాడుతూ,పిల్లల్లో ఉన్న దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయడం ద్వారా భవిష్యత్తులో సైంటిస్టులను తయారు చేసిన వారం అవుతామని ఆయన అన్నారు.
విద్యార్థులు కూడా ఈ రోబోటిక్స్ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని, డైరెక్టర్ రామోజీరావు సంతృప్తిని వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమం విజయవంతం కావటానికి, అధ్యాపక బృందం,రోబోటిక్స్ వింగ్ బృందం, ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా తీసుకొని, రోబోటిక్స్ ఎక్స్ ప్రో కార్యక్రమం విజయవంతం కావడానికిల కు చెందిన ప్రతి ఒక్కరికి తాను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన అన్నారు.ఆదివారం కూడా ఈ ప్రోగ్రాం కొనసాగుతుందని డైరెక్టర్ రామోజీరావు తెలిపారు.
ఆటోమెటిక్ హ్యాండ్ శానిటైజర్ నైన్ వి బ్యాటరీ తో సహాయంతో ఆటోమేటిక్ హ్యాండ్ శానిటైజర్ పనిచేస్తుంది.భూయాక బ్రెయిన్ తో సహాయంతో హ్యాండ్ శానిటైజర్ పనిచేస్తుందని. కాకతీయ ఒలంపియాడ్ స్కూల్ ఐదో తరగతి విద్యార్థులు తెలిపారు. కమ్యూనికేటర్ గీతిక, దక్షిత, టెక్నికల్ పర్సన్ నిత్యశ్రీ, ఏ ప్రవస్తి,మాన్యశ్రీ తదితరులు ఆటోమెటిక్ హ్యాండ్ శానిటైజర్ ఆవిష్కరణ లో పాల్గొన్నారు.