ఇటిక్యాల ఎమ్మార్వో ఆఫీస్ ప్రక్కన ప్రాథమిక పశు వైద్య కేంద్రం ఏర్పాటు
ఇటిక్యాల ప్రాథమిక పశు వైద్య అధికారి ఇంచార్జ్ డాక్టర్ భువనేశ్వరి.
జోగులాంబ గద్వాల 27 ఆగస్టు 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : ఇటిక్యాల . ఇటిక్యాల ప్రాథమిక పశు వైద్య కేంద్రం గతంలో గ్రామ పంచాయతీ పక్కన సేవలు అందించేవారు. ప్రాథమిక పశు వైద్య కేంద్రం శిలావస్థలో ఉన్నది. కనుక ఇటిక్యాల ఎమ్మార్వో ఆఫీస్ పక్కన ప్రాథమిక పశు వైద్య కేంద్రం సేవలు పశువులకు గొర్రెలకు మేకలకు ఇక్కడ వైద్యం చేస్తున్నట్లు ఇటిక్యాల మండలం ఇన్చార్జి పశువైద్య అధికారి డాక్టర్ భువనేశ్వరి తెలియజేశారు. మండలంలోని గొర్రెల కాపరులు రైతులు పశువుల చికిత్స కొరకు ఇటిక్యాల ఎమ్మార్వో ఆఫీస్ పక్కన హాస్పటల్ ఉన్నది. మండలంలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం పరుచుకోవాలని ఇన్చార్జి డాక్టర్ భువనేశ్వరి మండలంలోని ప్రజలని కోరారు. ఇటిక్యాల ప్రాథమిక పశు వైద్య అధికారి ట్రాన్స్ఫర్ పై గత రెండు నెలల క్రితం పోవడం జరిగింది. అప్పటినుంచి ఇటిక్యాల ప్రాథమిక పశు వైద్య అధికారి లేక ఎర్రవల్లి మండల పశు వైద్య అధికారి డాక్టర్ భువనేశ్వరి ఉన్నత అధికారులఆదేశం మేరకు ఇటిక్యాల ప్రాథమిక పశు వైద్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలియజేశారు. ఇటిక్యాలప్రాథమిక పశు వైద్య కేంద్రంలో అటెండర్ శ్రీనివాసులతో ఇక్కడ విధులు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలియజేశారు. రైతుల ఆధార్ అప్డేషన్ కార్యక్రమం జరుగుతున్నది. ఇప్పటికీ ఇటిక్యాల మండలంలో 50 శాతం పూర్తయినట్లు ఆమె తెలియజేశారు. ఇంకా మిగతావిత్వరగా పూర్తి చేస్తామని ఆమె తెలియజేశారు. సిబ్బంది కొరత ఉన్నందువల్ల రెండు మండలాలు చూసుకోవడం ఇబ్బందికరంగా ఉందని ఆమె వాపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇటిక్యాల మండలానికి రెగ్యులర్ ప్రాథమిక పశు వైద్యాధికారి ఉంటే బాగుంటుందని మండలంలోని ప్రజా ప్రతినిధులు వివిధ గ్రామాల ప్రజలు కోరుతున్నారు.