అయిజ పోలీస్ స్టేషన్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

జోగులాంబ గద్వాల 26 జనవరి 2025 తెలంగాణ వార్త ప్రతినిధి. అయిజ:-76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలును అయిజ పోలీస్ స్టేషన్ లో ఎస్సై శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో ఆదివారం జాతీయ జెండాను ఎగరవేసి గౌరవ వందనం సమర్పించారు.ఈ సందర్భంగా ఎస్సై శ్రీనివాస్ రావు మాట్లాడుతూ ఎందరో మేధావులు, త్యాగధనుల కృషిఫలితమే మనకు 1950 జనవరి 26 న అతి పెద్ద రాజ్యాంగం ఏర్పడిందన్నారు. అప్పటి నుండి ప్రతీఏటా జనవరి 26న మనం గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నామన్నారు.కుల మతాలు వేరైనా మనమంతా ఒక్కటే,మనమంతా భారతీయులం అని అందరూ సోదరభావంతో మన కీర్తిని ప్రపంచ దేశాలకు చాటిచెప్పే సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లు భారతదేశం అని, భారత రాజ్యాంగం పౌరులుగా మనకు ఎంతో స్వేచ్ఛ, సమానత్వపు హక్కులు ఇచ్చిందని, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, వ్యక్తి గత స్వేచ్ఛ ఇచ్చిందని వాటిని దుర్వినియోగం చేయకుండా కాపాడాల్సిన బాధ్యత మన పౌరులు అందరిపైనా ఉందని, ఆయన అన్నారు.అనంతరం విద్యార్థులకు పుస్తకలు పంపిణి చేసారు.అనంతరం సిబ్బందికి మిఠాయిలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.