అమ్మ ఝాన్సమ్మ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక

పూజలు నిర్వహించిన తెట్టకుంట తండా గ్రామ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు 

Oct 4, 2024 - 14:03
 0  16
అమ్మ ఝాన్సమ్మ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక

పాలకుర్తి 04 అక్టోబర్ 2024 తెలంగాణావార్త రిపోర్టర్:- పాలకుర్తి నియోజకవర్గంలో గురువారం రోజు తొర్రూరు పట్టణంలో జరిగిన షాపింగ్ మాల్ ఓపెనింగ్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి  షాపింగ్ మాల్ నిర్వాహకులు వేసిన స్టేజి ఒక్కసారిగా కూలడంతో ఝాన్సమ్మ కాలు మడమ ఫ్రాక్చర్ హైదరాబాదులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండగా అట్టి ప్రమాదంపై విచారం వ్యక్తం చేస్తూ తిరుమలాయపల్లి ఆవాస గ్రామమైన నూతనంగా గ్రామపంచాయతీగా ఏర్పడిన తెట్టకుంట తండా(టీ.కే. తండా)గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బానోత్ నవీన్ ఆధ్వర్యంలో తండాలోని దుర్గమ్మ ఆలయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి ఝాన్సమ్మ ఆ దుర్గమ్మ ఆశీస్సులతో త్వరగా కోలుకొని మళ్ళీ ప్రజాసేవలోకి తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఇట్టి పూజాకార్యక్రమాలలో కాంగ్రెస్ పార్టీకార్యకర్తలు ధరావత్ దీప్లా,ఇస్లావత్ జీవులా,భూక్య సోమ్లా, కీమ్యా,రాజాలు, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333