PHC ఉప్పెర్ నందు పీర్ ఎడ్యుకేషన్ పై ఆశా కార్యకర్తలు మరియు హెల్త్ సిబ్బందికి శిక్షణ
జోగులాంబ గద్వాల 13 ఆగస్టు 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : రాష్ట్రీయ కిషోర్ స్వస్థ కార్యక్రమం RKSK లో భాగంగా PHC ఉప్పెర్ నందు ఆశా కార్యకర్తలు మరియు హెల్త్ సిబ్బందికి పీర్ ఎడ్యుకేషన్ కార్యక్రమంపై శిక్షణా కార్యక్రమం నిర్వహించబడింది.
హాజరైన అధికారులు:
1. *ప్రోగ్రాం ఆఫీసర్: డా. మొహమ్మద్ అస్గర్ అలీ*సార్
2. మెడికల్ ఆఫీసర్: డా. భరత్
3. డెమో: హీర్యా నాయక్
.. పాల్గొన్నవారు:
1. MPHEO: శ్రీ రవీందర్
2. NCD సూపర్వైసర్: శ్రీ శ్యామ్ సుందర్
3. PHN: శ్రీమతి నర్సమ్మ
4. MPHS: శ్రీమతి లక్ష్మి
5. PHC ఉప్పెర్ పరిధిలోని *ఆశా నోడల్స్, ఆశా ఫెసిలిటేటర్లు మరియు ANM లు Phc ఆశా కార్యకర్తలు
.... శిక్షణలో తెలిపిన ముఖ్యాంశాలు:
1. ప్రతి ఆశా తన పరిధిలో 10-19 సంవత్సరాల 4 మంది పీర్ ఎడ్యుకేటర్లను - 2 బాలికలు, 2 బాలురును ఎంపిక చేయాలి.
2. పీర్ ఎడ్యుకేటర్లు 15-20 మందితో గ్రూప్ ఏర్పాటు చేసి నెలకు 4 సమావేశాలు నిర్వహించాలి.
3. పోషకాహారం, రక్తహీనత, MHM, మానసిక ఆరోగ్యం, మాదక ద్రవ్యాల నివారణ వంటి అంశాలపై అవగాహన కల్పించాలి.
..ఈ సందర్భంగా డా. అస్గర్ అలీ మాట్లాడుతూ యుక్తవయస్సు వారిలో ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించడంలో పీర్ ఎడ్యుకేషన్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.