6 గ్యారెంటీలు 420 హామీలను అమలు చేయాలి
ప్రజావాణిలో విజ్ఞాపపత్రం
బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య
జోగులాంబ గద్వాల 7 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : అలంపూర్. నియోజకవర్గం ఐజ మండల కేంద్రంలో ఎంపీడీఓ ఆఫీస్ నందు ప్రజావాణి కార్యక్రమం లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి , ఎమ్మెల్యే విజయుడుఆదేశానుసారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో విజ్ఞాప పత్రంను ఇవ్వడం జరిగింది.
1000 రోజుల కాంగ్రెస్ విఫల పాలనలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ కేటీఆర్ పిలుపుమేరకు నిరసనలో భాగంగా ఆరవ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చి అమలు చేయకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న సందర్భంగా ఈరోజు ప్రజావాణిలో హామీలను నెరవేర్చాలని విజ్ఞాపపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్బంగా రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్య మాట్లాడుతూ....
ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను నిరుద్యోగులను ఉద్యోగులను విద్యార్థులను రైతులను మోసం చేస్తున్న దుర్మార్గమైన కాంగ్రెస్ ప్రభుత్వం..
ఇవాళ ఆరు గ్యారెంటీ ల పేరుతో మోసం చేసి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ఇవాళ ఆరు గ్యారెంటీలకు పంగనామాలు పెట్టి ఊరేగుతున్నాడు తప్ప అభివృద్ధి శూన్యం.
420 హామీలు ఇచ్చి 420 దొంగ ప్రభుత్వంగా మిగిలిపోయిన ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారం ప్రభుత్వం..
అనంతరం BRS పార్టీ MLA ల అక్రమ అరెస్ట్ కు వ్యతిరేకంగా నిరసన చేయడం జరిగింది
* ఇచ్చిన హామీలను అమలు చేయలేని దద్దమ్మ రేవంత్ రెడ్డి సర్కార్..
* బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రాకుండా అడ్డుకోవడం సిగ్గుచేటు దుర్మార్గం.
* అలంపూర్ నియోజకవర్గం ఐజ మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను అసెంబ్లీకి రాకుండా అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించడం సిగ్గుచేటు.
* ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంకు వ్యతిరేకంగా నిరసన తెలపడం జరిగింది
* బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని మా ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ని అలంపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే విజయుడు ని మరియు మా పార్టీ ఎమ్మెల్యేలను అక్రమంగా అరెస్ట్ చేసి బంధించడం రేవంత్ రెడ్డి సర్కార్ చేతకానితనానికి నిదర్శనం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో టిటి దొడ్డి మాజీ సర్పంచ్ శివకుమార్ కౌన్సిలర్ డాక్టర్ కృష్ణ కో ఆప్షన్ నెంబర్ మౌలా, అంజిబాబు లెనిన్ సంకాపురం వెంకట్ రాములు చిన్న రంగుల అన్న, తెలుగు వెంకటేష్ రంగస్వామి రామాంజనేయులు, వీరేష్, రాజు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు