36 లక్షల రైతుబంధు నిధులను పక్కదారి పట్టించిన ఏఈఓ
AEO ని సస్పెండ్ చేసి రెండు రోజులైనా మీడియాకు సమాచారం ఇవ్వని వ్యవసాయ శాఖ అధికారులు మీడియాకు సమాచారం తెలపకపోవడంతో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం బలిగెర గ్రామ వ్యవసాయ అధికారి దివ్య 64 మంది అర్హులైన రైతులకు చెందిన బ్యాంక్ ఖాతాల వివరాలు వ్యవసాయ శాఖ పంపకుండా బినామీ బ్యాంక్ ఖాతాలు పంపి 36 లక్షలు కాజేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని గుర్తించిన ఓ రైతు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ కు ఫిర్యాదు చేయగా రికార్డుల్లో పాస్ బుక్ నెంబర్లు సరిగా ఉన్న నగదు ఇతరులకు పడుతున్నట్లు గుర్తించి బదిరాలైన AEO దివ్య ను రెండు రోజుల క్రితం సస్పెండ్ చేశారు అయితే ఈ విషయాన్ని జిల్లా వ్యవసాయ అధికారులు మీడియాకు తెలుపకుండా గోప్యంగా ఉంచారు.