11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా""కె. ఆర్ .ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల కోదాడ

తెలంగాణ వార్త ప్రతినిధి కోదాడ : జీవన యోగ యోగ కే .ఆర్.ఆర్. ప్రభుత్వ జూనియర్ కళాశాల కోదాడలో ఎన్.ఎస్.ఎస్. విభాగం ఆధ్వర్యంలో "అంతర్జాతీయ యోగా దినోత్సవం" నిర్వహించడం జరిగింది. ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రాం అధికారి వేముల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ నారు రమణారెడ్డి పాల్గొని ఆయన మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ యోగ చేయడం వలన శాంతి, స్థిరత్వం సాధించవచ్చునని, గుండె, నరాల చికిత్సకు యోగ ప్రధాన ఔషధంగా పనిచేస్తుందని ఆయన అన్నారు. అలాగే యోగా వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని, యోగ కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా మన జీవన విధానంలో ఒకటన్నారు. ప్రతి ఒక్కరూ యోగ చేయడం వలన ఒత్తిడిని జయించ వచ్చునని, యోగాతో క్రమశిక్షణ, ఏకాగ్రత పెరుగుతుందని అన్నారు. వేముల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... ప్రపంచవ్యాప్తంగా 175 దేశాలకు పైగా యోగ ఆచరిస్తున్నారని, యోగాకు వయసుతో నిమిత్తం లేదని, సాధ్యమైనంతవరకు ప్రతి ఒక్కరూ నూనె పదార్థాలను వాడకంలో తగ్గించాలని అప్పుడు ఆరోగ్యం మెరుగవుతుందని అన్నారు. కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు ఆసనాలు వేసి, యోగ ప్రతిజ్ఞ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జి. లక్ష్మయ్య, జి.యాదగిరి, వి .బలభీమారావు, రమేష్ శర్మ, పి.రాజేష్, బి.రమేష్ బాబు, జి. వెంకన్న, కె.రామరాజు, జి.రవి కిరణ్, కె.సతీష్, జి. నాగరాజు, పి. తిరుమల, ఎస్. గోపికృష్ణ, ఎస్.కె ముస్తఫా, ఇ.నరసింహారెడ్డి, ఎస్. కే .ఆరిఫ్,ఎన్ జ్యోతిలక్ష్మి ,ఆర్. చంద్రశేఖర్, ఎస్. వెంకటేశ్వర చారి, టి. మమత, డి .ఎస్. రావు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.