హుజూర్నగర్ మండల కేంద్రంలో రామస్వామి గుట్ట వద్ద ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
సూర్యాపేట, 31 మార్చి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– హుజుర్నగర్ నియోజకవర్గ కేంద్రంలోని రామస్వామి గుట్టవద్ద 110 ఎకరాలలో నిర్మిస్తున్న 2,160 ఇందిరమ్మ ఇండ్ల మోడల్ హౌసింగ్ కాలనీని త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. మంగళవారం హుజుర్నగర్ నియోజకవర్గ కేంద్రంలోనీ రామస్వామి గుట్ట వద్ద నిర్మించిన మోడల్ హౌసింగ్ కాలనీ ని, అంతర్గత రోడ్లు, సభాస్థలిని, మొక్కలు నాటడం, హెలిపాడ్ స్థలాన్ని పరిశీలించి మిగిలి పోయిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత శాఖ ల అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలని, అర్హత లేని వారికి ఈ జాబితాలో పేరు ఉండకూడదని అని స్పష్టం చేశారు. అత్యంత అర్హులైన వారికి ప్రాధాన్యం ఇచ్చి, సూక్ష్మంగా పరిశీలించి ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసులు హౌసింగ్ పీడీ సిద్ధార్థ, మిషన్ భగీరథ కరుణాకర్ రెడ్డి, తహసిల్దార్ కవిత, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు