స్పెషల్ డ్రైవ్ డ్రంక్ అండ్ డ్రైవ్
తిరుమలగిరి 28 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి పోలీసు వారి ఆధ్వర్యంలో నిర్వహించే స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తిరుమలగిరి మండల కేంద్రంలోని చౌరస్తాలో సిఐ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ లైసెన్సులు లేకుండా వాహనాలు నడిపే వారిని , మరియు త్రాగి వాహనాలు నడిపే వారిని పట్టుకునేందుకు తనిఖీలు నిర్వహిస్తున్నామని, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడానికి అనుమతించే వారిపై చర్యలు తీసుకొనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వారి వెంట ఎస్సై వెంకట్ రెడ్డి, నాగారం ఎస్ఐ చిరంజీవి, కానిస్టేబుల్ జమిందార్ వెంకన్న, కోటేష్ మురారి సైదులు సంజీవ చారి విజయ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.