స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని శిక్షించాలని ఫిర్యాదు మందుల వెంకటేష్
అడ్డగూడూరు 7 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల ఎస్సై కి నమస్కరించి వ్రాయునది ఏమనగా విషయం:-దళిత స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయగలరని కోరుతూ..నేను అనగా మందుల వెంకటేష్ తండ్రి అవిలయ్య వయసు 27 కులం మాదిగ వృతి కూలీ గ్రామం,మండలం అడ్డగూడూరు,జిల్లా యాదాద్రి భువనగిరి తమకు చేయు విన్నపం ఏమనగా సోమవారం రోజు తేదీ 07-09-2026 న తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణం ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనలో ఎమ్మెల్సీ తాత మధు దళిత స్పీకరు అయిన గడ్డం ప్రసాద్ పై అన్ లాంగ్వేజ్ పదజాలంతో చేసిన వాక్యాలు మా దళిత ప్రజా ప్రతినిధి స్పీకర్ పై చేసిన వ్యాఖ్యలు, మనోభావాలను మా దళిత సమాజాని కించపర్చి,విధంగా మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయి కావున ఎమ్మెల్సీ తాత మధు అతనిని ఎగిసిన కేటీఆర్,హరీష్ రావులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి మా దళితుల ఆత్మ గౌరవాన్ని కాపాడగలరని మందుల వెంకటేష్ ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు యాదాద్రి భువనగిరి జిల్లా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు.