**సైబర్ నేరాలు, గంజాయి డ్రగ్స్ నియంత్రణపై పోలీస్ కళాజాత"కోదాడ రూరల్ *

తెలంగాణ వార్త ప్రతినిధి కోదాడ : కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్
*సైబర్ నేరాలు, గంజాయి డ్రగ్స్ నియంత్రణపై పోలీస్ కళాజాత*
ఎస్పీ కె నరసింహ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు కోదాడ రూరల్ CI రజితా రెడ్డి గారు,SI అనిల్ రెడ్డి మండల కేంద్రంలోనీ కొమరబండ ప్రభుత్వ పాఠశాల లో సైబర్ నేరాలపైన, అన్ లైన్ బెట్టింగ్, గంజాయి, డ్రగ్స్ మత్తుమందులపై, రోడ్డు ప్రమాదాలపై పోలీసు కళాభృందంతో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది.
*ASI రాజా మాట్లాడుతూ ఎస్పీ కె. నరసింహ IPS గారి ఆదేశాల మేరకు ప్రజలకు పోలీసుకు మైత్రి కలిగి ఉండాలన్నారు
ఎవరైనా ఆకతాయిలు ఆడపిల్లలను, మహిళలను వేధింపులకు గురి చేస్తే కోదాడ షీ టీం 8712686056 కి సమాచారం ఇవ్వండి మీయొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అని తెలిపారు*
*వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఏటీఎం పిన్ నెంబర్లు, సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దన్నారు. వ్యక్తిగత ఫోటోలను DP లుగా పెట్టుకోవద్దని చెప్పారు.మొబైల్ యాప్ లలో వచ్చేటువంటి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చెయ్యొద్దు అని తెలిపారు. యువత చెడు వ్యసనాల బారిన పడొద్దు అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడపవద్దు ట్రాఫిక్ రూల్స్ ను*అతిక్రమించొద్దు అని అన్నారు
- ప్రజల రక్షణ భద్రత కోసం పోలీసు ఉందన్నారు.
- మన గ్రామ వాతావరణం మన పిల్లల, యువత భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది.
- సమస్యాత్మక గ్రామంగా పోలీసు రికార్డ్ లలో ఒకసారి నమోదైతే పేరు ఎప్పటికీ అలాగే నిలిచి పోతుంది.
- పెద్దలను చూసి యువత అదే మార్గంలో నడుస్తుంది.
- యువత ఒక్కసారి కేసుల్లో చిక్కుకుంటే భవిష్యత్తులో ఉద్యోగాలు పొందే విషయంలో, విదేశాలకు వెళ్లే విషయంలో, పాస్ పోర్ట్, విసా పొందే విషయంలో పోలీసు అనుమతులు ఇవ్వబడవు, సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
- మహిళలను గౌరవించాలి, మహిళా రక్షణలో చట్టాలు బలోపేతం చేయబడ్డాయి, మహిళలను, పిల్లలను వేదిస్తే షీ టీం నెంబరు 8712686056 కి ఫిర్యాదు చేయవచ్చు కేసులు నమోదు చేసి శిక్షలు పడేలా పోలీసు దర్యాప్తు ఉంటుంది.
- ఉచిత భాహుమతులు, తక్కువ రేటుకు వస్తువులు వస్తాయి, లాటరీ వచ్చినది, తక్కువ వడ్డీ లోన్ లు ఇస్తాము, డబ్బులు కడితే ఉద్యోగం ఇస్తాము, తక్కువ పెట్టుబడికి ఎక్కువ లాభం వస్తుంది ఇలాంటివి ఎవరైనా అపరిచితులు ఫోన్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, మెసేజ్ ల ద్వారా తెలిపితే నమ్మి అత్యాశకు పోయి సైబర్ మోసాలకు గురై డబ్బులు పోగొట్టుకోవద్దు.
- బెట్టింగ్ ప్రకటనలు నమ్మి డబ్బులు బెట్టింగ్ పెట్టవద్దు, అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకోవద్దు. అశ్లీలపు వీడియో కాల్స్ మాట్లడి ప్రాణలమీదకు తెచ్చుకోవద్దన్నారు.
- రోడ్డు ప్రయాణ సమయంలో జాగ్రత్తగా ఉండాలి, మద్యం తాగి వాహనాలు నడపవద్దు, పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దు.
- గంజాయి లాంటి మాదకద్రవ్యాలు మన గ్రామంలోకి రానివ్వద్దు, ఎవరైనా డ్రగ్స్ కు అలవాటు పడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
- పేకాట, బెట్టింగ్ లాంటి, బహిరంగంగా మద్యం తాగడం లాంటి అసాంఘిక చర్యలకు పాల్పడవద్దు. వీటిపై పోలీసుకు సమాచారం ఇవ్వాలి.
- శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో మూఢనమ్మకాలు నమ్మవద్దన్నారు.
-
ఈ కార్యక్రమం నందు పాఠశాల హెడ్ మాస్టర్ పీ గోవిందయ్య,కోదాడ షీ టీమ్ మహిళా SI మాధురి, కానిస్టేబుల్ నాగేశ్వరావు, సతీష్, హోం గార్డ్ అమర్నాథ్ రెడ్డి, పిడి ఏడుకొండలు,కళాబృందం ఇన్చార్జి యల్లయ్య,గోపయ్య,చారి, గురు లింగం, నాగార్జున కృష్ణ, విద్యార్థులు పాల్గొన్నారు.