సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తం ఎస్సై సురేష్
ఆ లింకులు పై క్లిక్ చేయకండి
అలా చేస్తే మీ బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతాయి
ఎవరు ఫోన్ చేసినా ఓటిపిలు వివరాలు చెప్పవద్దు
టోల్ ఫ్రీ నెంబర్ 1930 తిరుమలగిరి పోలీస్
తిరుమలగిరి 19 ఆగస్టు 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ ప్రక్రియ మొదలు కావడంతో సైబర్ మోసగాళ్లు సరికొత్త మోసానికి తెలతీసినట్లు తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు వివిధ బ్యాంకుల పేరుతో వాట్సాప్ ప్రొఫైల్ ఫోటోలో బ్యాంకు గుర్తు లోగో పేరు మరియు బ్యాంకు అధికారుల ఫోటోలతో నకిలీ వాట్సప్ అకౌంట్ ని సృష్టించి వాటి నుండి మోసపూరితమైన లింకులు ఏపీకె ఫైల్స్ ను పంపుతున్నారని అప్రమత్తం చేశారు ఈ సందర్భంగా ఎస్సై సత్యనారాయణ గౌడ్ పత్రిక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బ్యాంకుల పేరిట వాట్సాప్ లో వచ్చే అనుమానస్పద లింకులపై క్లిక్ చేయవద్దని వాడిని డౌన్లోడ్ చేస్తే మన మొబైల్ ఫోన్ సైబర్ నేరగల నియంత్రణలోకి వెళుతుందని తెలిపారు అదేవిధంగా మన ఫోన్లోని కాంటాక్ట్ నెంబర్లకు సైతం మనం పంపినట్టుగా ఈ మోసపూరితమైన లింకులు వెళ్తాయని హెచ్చరించారు దీనివల్ల మీ పేరుతో సైబర్ నేరగాళ్లు డబ్బులు కొల్లగొట్టే ప్రమాదం ఉందని పేర్కొన్నారు ఒకవేళ ఇలాంటి ఆన్లైన్ మోసానికి గురైతే వెంటనే ఇలాంటి ఆలస్యం చేయకుండా 1930 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు