సైబర్ నేరగల చేతిలో మోసపోవద్దు ఎస్సై డి.నాగరాజు

అడ్డగూడూరు 07 సెప్టెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:-సైబర్ క్రైమ్ అవేర్నెస్ అనేది సామాజిక బాధ్యతగా ప్రతి వాళ్ళు తీసుకోవాలి! ఇంట్లో కుటుంబ సభ్యులకు అయినా సైబర్ క్రైమ్స్ గురించి వివరించాలి! ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు మన రాష్ట్రం కానీ,
1) తెలియని కాల్స్ లిఫ్ట్ చెయ్యాల్సిన అవసరం లేదు.
2) తెలియని అకౌంట్స్ కి మనీ పంపొద్దు,
3) తెలియని లింక్స్ క్లిక్ చెయ్యొద్దు
4) తెలియని వ్యక్తులు ఫోన్ చేసి మీకు లాభం/నష్టం ఉంది, అంటే అస్సలు నమ్మొద్దు,
5) బ్యాంకు పేరుతో వచ్చే కాల్స్ పొరపాటున నమ్మవద్దు, PIN, పాస్వర్డ్స్, OTP, అంటే అకౌంట్ కి గుండె లాంటివి మనకి తప్ప ఇంక్కొక్కరికి చెప్పవాల్సిన అవసరం లేదు
6)లోన్ అప్స్ లో లోన్ తీసుకొని ని ఫోన్ లో ఉన్న కాంటాక్ట్ వాళ్ళని ఇబ్బందులు పెట్టవద్దు, అప్లికేషన్ లో కాంటాక్ట్, గేలరీ పర్మిషన్ ఇస్తేనే లోన్ ఇస్తాడు మీకు మీరు మనీ కట్టిన కాంటాక్ట్స్ లో ఉన్న వారందరిని హరస్ చేస్తారు
7) CBI/ED /NB/ACBల పేరుతో వచ్చే కాల్స్ అన్ని ఫ్రాడ్ కాల్స్.CBI/ED /NB/ACBలో పని చేసే అధికారులు ఎవ్వరికి ఫోన్ చెయ్యరు.వాట్సాప్ డిపిలో పోలీస్ ఆఫీసర్ పిక్ ఉండి మీకు కాల్స్ వస్తే అవ్వి ఫ్రాడ్ కాల్స్, కొడుకు,కూతురు డ్రగ్స్, రేప్ కేసులో ఈరుక్కున్నారు, అనగానే భయపడవద్దు,, ఫోన్ ఆఫ్ చేసి మీ కొడుకు /కూతురుకి ఫోన్ చెయ్యండి.
8) డబ్బు గురించి ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్, ఇతర సోషల్ మీడియా లో వచ్చే ప్రకటనలు సైబర్ నేరస్తుల పని, ఆన్లైన్ అంటేనే మాయ ప్రపంచం గా గుర్తుపెట్టుకోవాలి
9) చాలా మంది తెలియని వ్యక్తుల టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవుతున్నారు, అందులో చాలా మందికి డబ్బులు వస్తున్నాయి, డ్రా చేస్తున్నట్లు చూపిస్తారు,తెలియక ఇన్స్వెస్ట్ చేస్తున్నారు, మొదట రూపాయి కి పది ఇస్తాడు, లక్ష పెట్టగానే మాయం అవుతాడు, దయచేసి 1 రూపాయి పెట్టి లక్షలు రావాలని అత్యాశ కి వెళ్లి ఉన్నవి పోగొట్టుకుంటున్నారు దయచేసి ఆలా చెయ్యొద్దు(ముఖ్యం గా జాబ్ చేస్తున్న వాళ్ళు)
10) హనీ ట్రాప్ అంటే గుర్తు తెలియని అమ్మాయిల నుండి వాట్సాప్ వీడియో కాల్స్ వస్తాయి మనం లిఫ్ట్ చేస్తే వారు బట్టలు తీసేసి (న్యూడ్ కాల్స్) మాట్లాడుతూ తర్వాత మిమ్మల్ని మీ వీడియో ఇంటర్ నెట్ లో పెడతాం అని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తారు.జాగ్రత్తగా ఉండాలని అడ్డగూడూరు ఎస్సై డి నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు.