సైన్సు టీచర్లతో సైన్స్ మాత్రమే చెప్పించాలి

May 31, 2024 - 21:09
 0  4

తెలంగాణ వార్త  సైన్సు టీచర్లతో సైన్స్ మాత్రమే చెప్పించాలి : పోరం ఆఫ్ ఫిజికల్ సైన్స్ టీచర్స్ సూర్యాపేట* సైన్సు ఉపాధ్యాయులను సైన్సు బోధనకే పరిమితం చేయాలని ఫోరమ్ అఫ్ ఫిజికల్ సైన్స్ టీచర్స్ (FPST ) సూర్యాపేట శాఖ అధ్యక్షులు చింతరెడ్డి రామలింగారెడ్డి కోరారు శుక్రవారం వారు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం నుండి 6,7 తరగతులకు సంబంధించిన గణితమును భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు బోధించాలని విద్యాశాఖ కార్యదర్శి గారు మెమో నెంబర్ 11143 ద్వారా ఉత్తర్వులు విడుదల చేశారని పేర్కొన్నారు ఈ ఉత్తర్వులు అసమగ్రంగా ఉన్నాయని వెంటనే రద్దు చేయాలని కోరారు జేఈఈ ఐ ఐటి నీట్ తదితర పోటీ పరీక్షలలో భౌతిక రసాయన శాస్త్రాలు కీలకంగా ఉందన్నారు కొందరు ఉపాధ్యాయుల ఒత్తిడితో భౌతిక శాస్త్రం ఉపాధ్యాయులపై గణితశాస్త్రం కూడా రుద్దే ప్రయత్నం చేస్తున్నారని అది సరికాదు అని పేర్కొన్నారు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు సైన్సు ఉపాధ్యాయులతో గణితం చెప్పించడం వలన విద్యార్థులకు గణితం సామర్థ్యాలు తగ్గుతాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పోరం బాధ్యులు k. గురుమూర్తి, చందా శ్రీను, జ్యోతుల చంద్రశేఖర్ యామా రమేష్ కందుకూరి సోమశేఖర్ రావిరాల చంద్రశేఖర్ పిన్ని మధు బింగి లక్ష్మయ్య D. ఎల్లయ్య గోపయ్య పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు