సూర్యాపేట మున్సిపాలిటీ లో పదివేల మంది మహిళకు ఉచితంగా కుట్టు శిక్షణ

టూరిజం డెవలప్‌మెంట్  కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి

Jul 17, 2026 - 18:19
Jul 17, 2026 - 19:02
 0  1
సూర్యాపేట మున్సిపాలిటీ లో పదివేల మంది మహిళకు ఉచితంగా కుట్టు శిక్షణ
సూర్యాపేట మున్సిపాలిటీ లో పదివేల మంది మహిళకు ఉచితంగా కుట్టు శిక్షణ
సూర్యాపేట మున్సిపాలిటీ లో పదివేల మంది మహిళకు ఉచితంగా కుట్టు శిక్షణ

సూర్యాపేట 18 జూలై 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- సూర్యాపేట మండలంలోని బాలెంల గ్రామంలో మదర్ ఇండియా సేవా సంస్థ ఆధ్వర్యంలో 150 మంది మహిళలకు కుట్టు శిక్షణ పూర్తి చేసిన సందర్భంగా వారికి సర్టిఫికెట్ల కోసం  తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి తన సొంత ఖర్చులతో 90,000/-  చెక్కును మదర్ ఇండియా నిర్వాహకులు బొజ్జ సంధ్యారెడ్డికి అందజేశారు. ఈ  సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి  నివాసం జరిగిన కార్యక్రమంలో 108 మంది మహిళలకు కుట్టు శిక్షణ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత రెండు దశాబ్దాల నుండి స్ప్రైడ్ ఇండియా ద్వారా సూర్యాపేట నియోజకవర్గం లో  అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని,  సూర్యాపేట నియోజకవర్గంలోని  అనేక గ్రామాలలో వాటర్ ప్లాంట్ ల నిర్మాణం,  ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక వసతులు,  టాయిలెట్స్ నిర్మాణం, బెంచీలు కంప్యూటర్ ల్యాబ్ లు,  సైన్స్ ల్యాబ్ ల  నిర్మాణం కోసం తమవంతు సహాయం చేస్తున్నామని చెప్పారు.

:సూర్యాపేట మున్సిపాలిటీ లోని వార్డులలో   కుట్టు శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి పదివేల మంది మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణను అందించి,  స్వయం ఉపాదిని అందజేస్తామని  చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వెలుగు వెంకన్న, కౌన్సిలర్ లు జ్యోతి కరుణాకర్, నామ అరుణ, బైరబోయిన శ్రీనివాస్, పిల్లల రమేష్ నాయుడు,పాలగాని కృష్ణ,  కోడి శిరీష, బాలెంల సర్పంచ్ మమత నగేష్ కాంగ్రెస్ నాయకులు వల్దాసు దేవేందర్, ధర్మా నాయక్, తండు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333