సూర్యాపేట మున్సిపాలిటీలో పదేండ్లలో 100 కోట్ల అవినీతి
మున్సిపల్ సాధారణ సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడిన కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కెక్కిరేణి శ్రీనివాస్, కౌన్సిలర్లు కొండపల్లి నిఖిల, ఎడ్ల గంగాభవాని, అన్నేపర్తి రాజేష్ తదితరులు
పదేళ్లుగా జరిగిన అవినీతిని ప్రశ్నించడమే కాంగ్రెస్ కౌన్సిలర్ల తప్పా
సూర్యాపేట మున్సిపాలిటీలో పదేండ్లలో 100 కోట్ల అవినీతి జరిగింది
హరితహారం లో 15 కోట్లు రోడ్ల నాణ్యతలోపంతో పాటు డివైడర్లు వంటి కార్యక్రమాల్లో సుమారు 100కోట్ల అవినీతి
కేవలం బిఆర్ఎస్ పార్టీ 17 మంది కౌన్సిలర్లకే పట్టణ ప్రగతి నిధులు 5 లక్షల రూపాయలు కేటాయించారు
అవినీతిని ప్రశ్నించినందుకే మా 31 మంది కౌన్సిలర్లకు పట్టణ ప్రగతి నిధులు ఐదు లక్షలు కేటాయించలేదు
బాల్యంలో డంపింగ్ యార్డులో 35 లక్షల రూపాయలు రోడ్ల పనుల్లో 10కోట్లు, హరితహారం లో 10 కోట్ల అవినీతిని ప్రశ్నించినందుకే నిధులు కేటాయించలేదు
సూర్యాపేట జిల్లా కేంద్రంలో పారిశుధ్య ఇతర సమస్యలకు మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి మూడు కోట్ల 35 లక్షల రూపాయల నిధులు కేటాయించడం పట్ల ధన్యవాదాలు
మొత్తం 59 అంశాలలో 28 కలక్టర్ సెక్షన్ 6 కింద ఆమోదించారని చెబుతున్నారని అలాంటప్పుడు ఎజెండాలో ఎందుకు పెట్టాలని కనీసం ఫ్లోర్ లీడర్లకు అయినా సమాచారం ఇవ్వలేదు
విలీన గ్రామాలకు జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాల్సి ఉన్న పదేళ్లుగా ఎలాంటి నిధులు కేటాయించలేదు
కేటీ అన్నార, రాయని గూడెం రోడ్డుకు 5కోట్ల రూపాయలు మంజూరు కాగా మాజీ మంత్రి బినామి డి ఎస్ ఆర్ అగ్రిమెంట్ చేసుకుని నేటికీ పనులు మొదలు పెట్టలేదు
ఇదేమని ప్రశ్నిస్తే నిధులు మురికి పోయారని చెబుతున్నారు
అధికారులు కమిషనర్ చైర్మన్ అంతా వారే ఉండడంతో ఇక్కడ కాంగ్రెస్ కౌన్సిలర్లు చెప్పిన మాకు పనులు కావడం లేదు
ఇటీవల వేసిన పాత జాతీయ రహదారికి ప్యాచ్ వర్క్ కోసం 13 లక్షలు పాత మున్సిపల్ కార్యాలయానికి మరో 30 లక్షలు, నూతన కలెక్టరేట్ రోడ్డుకు 20 లక్షలు కేటాయించి అవినీతికి పాల్పడ్డారు.