సూర్యాపేట పట్టణంలో బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్ వారి సహకారంతో వీధి కుక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు

Sep 10, 2026 - 20:27
 0  1

పట్టణంలో మెంజ్ వైరస్ సోకి చర్మవ్యాధులతో బాధపడుతున్న వీధి కుక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని వీధి కుక్కల చర్మవ్యాధులు, ప్రజల్లో నెలకొన్న ఆందోళనపై వార్త కథనం వచ్చిన విషయం తెల్సిందే. దీనికి మానవతా దృక్పథంతో స్పందించిన బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్ వ్యవస్థాపకురాలు అక్కినేని అమల చర్మవ్యాధులతో బాధపడుతున్న కుక్కల చికిత్స కోసం సుమారు రూ.1.80 లక్షల విలువైన ఇంజెక్షన్లు, మందులను హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు పంపించారు.

 చర్మవ్యాధులతో బాధప డుతున్న కుక్కల చికిత్స కోసం రూ.1.80 లక్షల విలువైన ఇంజెక్షన్లు, మందులను సూర్యాపేటకు పంపించడం పట్ల ఆమెకు పట్టణ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 
ఈ సందర్బంగా జిల్లా వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ డా,, S కిరణ్ కుమార్ గారు మరియూ జిల్లా బ్లూ క్రాస్ ఇంఛార్జ్ నరేందర్ నాయుడు గారు మాట్లాడుతూ

 మున్సిపల్ చైర్మన్ మోరిశెట్టి నివేదిత లక్షాధి గారు మరియూ కమీషనర్ సిహెచ్ హనుమంత రెడ్డి గారి సహకారంతో పట్టణంలో ఇప్పటివరకు 194 వైరస్ సోకిన కుక్కలను గుర్తించినట్లు పేర్కొన్నారు. వాటికి దశలవారీగా చికిత్సలు అందించి పూర్తిస్థాయిలో కోలుకునేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇటీవల బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్ షెల్టర్ డైరెక్టర్ ఎన్.ఎస్.కె కుమారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం సూర్యాపేటకు వచ్చి చర్మవ్యాధులతో బాధపడుతున్న కుక్కలను గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు.  హైదరాబాద్ నుంచి మందులు తీసుకువచ్చి చికిత్స కార్యక్రమాన్ని గథ జూలై నెలలో ప్రారంభించామని తెలిపారు. పట్టణంలోని 48 వార్డులలో వైరస్ సోకిన కుక్కలను గుర్తించి అవసరమైన వ్యాక్సిన్లు, మందులు అందించి వ్యాధి తగ్గుముఖం పట్టినట్లు వారు తెలిపారు.

ఈ కార్యక్రమం లో మాచర్ల గణేష్(VA), వేణు(OS), లింగస్వామి(వెటర్నరీ వ్యాక్సినేటర్), అస్రరుద్దీన్(ఓఎస్), మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గోన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333