సూర్యాపేట జిల్లా పోలీసు సీజ్ చేసిన 227.18 కేజీల గంజాయి నిర్విర్యం
సూర్యాపేట జిల్లా పోలీసు సీజ్ చేసిన 227.18 కేజీల గంజాయి నిర్విర్యం
జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ అధ్వర్యంలో ప్రభుత్వం, కోర్టు ఉత్తర్వుల ప్రకారం నిర్వీర్యం.
పర్యావరణ రక్షణ, ప్రజా ఆరోగ్యానికి హని కలగకుండా జాగ్రత్తలు.
యాదాద్రి జిల్లా తుక్కాపుర్ గ్రామంలో గల రోమా ఇండస్ట్రీస్ నందు అత్యాధునిక సాధనంతో బూడిద చేశాం.
కె.నరసింహ, ఎస్పి సూర్యాపేట జిల్లా
29 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 227.18 కేజీ గంజాయినీ ప్రభుత్వ, కోర్టు ఉత్తర్వుల మేరకు జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ అధ్వర్యంలో ఈరోజు యాదాద్రి జిల్లా లో గల తుక్కాపుర్ గ్రామం లోగల రోమా ఇండస్ట్రీస్ నందు యాజమాన్యం, సిబ్బంది సహాయంతో ప్రభుత్వ సాక్షుల సమక్షంలో గంజాయిని నిర్వీర్యం చేసి బూడిద చేయడం జరిగినది అని డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ ఎస్పి నరసింహ ఐపిఎస్ గారు తెలిపినారు. పర్యావరణానికి, ప్రజా జీవనానికి ఎలాంటి హానీ కలగకుండా జాగ్రత్తలు తీసుకుని నిర్విర్యం చేయడం జరిగినది అన్నారు. దీనివిలువ 1 కోటి పైనే ఉంటుంది అన్నారు.
డ్రగ్స్ నివారణ అందరి సామాజిక బాధ్యత. డ్రగ్స్, గంజాయి వినియోగించడం వల్ల యువత భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. డ్రగ్స్ రవాణా, వినియోగం నేరం అని ఎస్పి అన్నారు. గంజాయి నివారణ లో జిల్లా పోలీసు కృషి చేస్తుంది అన్నారు. డ్రగ్స్ అమ్మకం, రవాణా, వినియోగం కు సంభందించి పోలీసులకు, డయల్ 100, 112, 1908 కు సమాచారం ఇవ్వాలి అన్నారు. డగ్స్, గంజాయి వియోగించే వారిని, వ్యాపారం చేసే వారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇస్తున్నామని తెలిపినారు. తల్లిదండ్రులు పిల్లల అలవాట్లను గమనిస్తూ చెడు వ్యసనాలకు లోనవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ సభ్యులు సూర్యాపేట డివిజన్ DSP ప్రసన్న కుమార్, కోదాడ డివిజన్ DSP శ్రీనివాస్ రెడ్డి, జిల్లా క్రైమ్ రికార్డ్ బ్యూరో డీఎస్పీ రవి, ఏఆర్ డిఎస్పీ నరసింహ, ఎస్ఐ లు యాకూబ్, జాన్సీరాణి, సిబ్బంది ఉన్నారు.