సభ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే గారు జిల్లా కలెక్టర్ , జిల్లా ఎస్పీ
జోగులాంబ గద్వాల 18 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల. నియోజకవర్గం లోని ధరూర్ మండల కేంద్రంలో తెలంగాణ భూ భారతి రెవెన్యూ అవగాహన సదస్సు కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి * విచ్చేసిన సందర్భంగా ఈ రోజు *ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి , జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ , జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు, జాయింట్ కలెక్టర్ లక్ష్మీనారాయణ . సభా స్థలాన్ని పరిశీలించి ఏర్పాట్ల విషయాలను తెలుసుకోవడం జరిగింది రేపు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో RDO, MRO ,ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్, మాజీ వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, అజయ్, రిజ్వాన్, రెహమాన్, అధికారులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.