శిథిలావస్థకు చేరువలో అయిజ ప్రభుత్వ ఆసుపత్రి.

Mar 15, 2025 - 19:20
Mar 15, 2025 - 21:11
 0  23

జోగులాంబ గద్వాల 15 మార్చ్ 2025 తెలంగాణవార్త ప్రతినిధి. అయిజ: 15/03/2025 భారతీయ జనతాపార్టీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు ఎస్ రామచంద్రారెడ్డి, అయిజ పట్టణ అధ్యక్షులు కంపాటి భగత్ రెడ్డి మరియు నాయకులతో కలిసి ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించడం జరిగింది

ఈ సందర్భంగా జిల్లా రామచంద్రారెడ్డి అధ్యక్షులు మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రి భవనం శిథిలావస్థకు చేరింది. దాదాపు అన్ని చోట్ల ఆసుపత్రి భవనంలో పెచ్చులూడుతోంది. పలు గదుల్లో పైకప్పు పెచ్చులూడి రోగులు, వైద్యులపై పడుతున్నాయి. వర్షాకాలంలో గదుల్లోకి నీరు చేరుతోంది. కనీస మరమ్మతులు కూడా చేయకపోవడంతో రోజురోజుకు దెబ్బతింటున్నాయి పాలకులు పట్టించుకోకపోవడంతో, మరమ్మతులు చేసేందుకు వీలులెనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. చాలా గదుల్లో గోడలు నెర్రెలు భారాయి. పైకప్పు దెబ్బతిని పెచ్చులుడుతున్నాయి.  స్లాబ్ లో ఇనుప కడ్డీలు తుప్పు పట్టి, విరిగి బయటకి కనిపిస్తున్నాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు మరియు సిబ్బంది భయాందోళనలో ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం 30 పడకల భవనం నిర్మాణంలో ఉన్న పనులను గాలికొదిలేశారు. ఇప్పటికైనా అధికారులు ప్రజల ప్రాణాల దృశ్య, మరమ్మతులపై దృష్టి సారించాలని, 30 పడకల ఆసుపత్రిని ఉపయోగంలోకి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్, వీరేష్ గౌడ్, నరసింహులు, రఘు,  రాజశేఖర్, చిన్ని కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State