శాంతియుత వాతావరణం లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలి...... ఎస్ఐ ప్రవీణ్ కుమార్

Aug 21, 2025 - 18:17
Aug 21, 2025 - 18:53
 0  9
శాంతియుత వాతావరణం లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలి...... ఎస్ఐ ప్రవీణ్ కుమార్

మునగాల 21 ఆగస్టు 2025 తెలంగాణ వార్త ప్రతినిధి:-   ప్రజలు శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలని ఎస్ ఐ.ప్రవీణ్ కుమార్ తెలిపారు,  గణేష్ మండపాల నిర్వాహకులు పాటించవలసిన నియమనిబంధనలు, గురించి ఎస్ఐ. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ  గణేష్ మండపాల పూర్తి బాధ్యత మండపాల నిర్వహకులదే.ప్రతీ మండపం వద్ద తప్పని సరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.నిర్దేశించిన సమయనికి నిమర్జనం పూర్తి చేయాలి గణేష్ మండపాలు ప్రజా రవాణాకు,ఎమర్జెన్సీ వాహనాలకు, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలి. మండపం ఏర్పాటు చేసే స్థలం కోసం సంబంధిత శాఖల వారితో అనుమతులు తీసుకోవాలి.గణేష్ మండపాల నిర్వాహకులు వారి మండపాల కమిటీ వివరాలు,మండపాల బాధ్యత వహించే వారి వివరాలు, ఫోన్ నెంబర్ల ను మండపంలో ఏర్పాటు చేయాలి.రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించాలి.

డి.జే లు ఏర్పాటు చేయరాదు.

గణేష్ మండపంలో 24 గంటలు ఒక వాలంటీర్ ఉండే విధంగా నిర్వహకులు తగు చర్యలు తీసుకోవాలి.గణేష్ మండపాలకు వచ్చే భక్తుల సందర్శన ను దృష్టిలో వుంచుకోని మండపాలలో భక్తుల కోసం క్యూలైన్లను ఏర్పాటు చేయడంతో పాటు వాలంటీర్లను నియమించాలి.

గణేష్ మండపాల వద్ద ఎప్పుడైన అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ముందు జాగ్రత్తలో భాగంగా దగ్గరలో రెండు బకెట్ల నీళ్లు ఏర్పాటు చేసుకోవాలి

గణేష్ మండపాల వద్ద మద్యం సేవించడం, పేకాట అడటం, అసభ్యకరమైన నృత్యాల ఏర్పాటు, అన్యమతస్తులను కించపరిచే విధంగా ప్రసంగాలు చేయడం,పాటలు పాడటంపై పూర్తిగా నిషేధం.

పోలీసు తనిఖీలకు సహకరించాలి, పాయింట్ బుక్ ఏర్పటు చేసుకోవాలి.

మండపాల వద్ద ఏదైనా అనుమానాస్పదంగా బ్యాగులు, ప్లాస్టిక్ సంచులు, వస్తువులు వ్యక్తులు కనిపించినట్లుయితే తక్షణమే డయల్ 100గాని లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి. ఎస్ఐ. ప్రవీణ్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State