వైద్య సిబ్బందితో జిల్లా వైద్యాదికారులు సమీక్ష సమావేశం

Jan 17, 2025 - 19:30
Jan 17, 2025 - 20:56
 0  12
వైద్య సిబ్బందితో జిల్లా వైద్యాదికారులు సమీక్ష సమావేశం

జోగులాంబ గద్వాల 17 జనవరి 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో, శుక్రవారం జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్లు,ఆశ నోడల్ పర్సన్స్ మరియు ఆశ ఫెసిలిటేటర్ కి సమీక్షా సమావేశం నిర్వహించారు.ఆశా నోడల్ పర్సన్స్ మరియు ఆశా ఫెసిలిటేటర్స్ అందరూ హై రిస్క్ ప్రెగ్నెన్సీ లను, ఫాలో  అప్ చేయాలని, అదేవిధంగా బరువు తక్కువ  పిల్లలను గుర్తించి న్యూట్రిషన్ రిహాబిలిటేషన్ సెంటర్ కి రెఫర్ చేయాలని, పుట్టిన పిల్లలందరికీ వ్యాధి నిరోధక టీకాలు ఇప్పించేటట్లు పర్యవేక్షించాలని, తీవ్ర రక్తహీనత ఉన్న గర్భిణీ స్త్రీలను గుర్తించి, చికిత్సలు అందించేటట్లు  చూడాలని, అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు అన్ని రకాల ఆరోగ్యం  సేవలు ఆరోగ్య కార్యకర్తలు, మరియు ఆశా కార్యకర్తలు అందించాలని, మాతృ మరణాలు మరియు శిశు మరణాలు జరగకుండా ఆరోగ్య సేవలు గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, శిశువులకు అందించాలని, అదేవిధంగా జోగులాంబ  గద్వాల జిల్లాలో అన్ని రకాల ఆరోగ్య కార్యక్రమాలు ఆశా నోడల్స్ మరియు ఆశ ఫెసిలిటేటర్స్, ఫీల్డ్ లెవెల్ లొ పర్యవేక్షించాలని, అన్ని రకాల ఆరోగ్య కార్యక్రమాలను ఫాలో అప్ చేయాలని  తెలిపారు.. ఈ సమీక్ష సమావేశంలో, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్. ప్రసూనా రాణి( ప్రోగ్రాం ఆఫీసర్ మాత శిశు సంరక్షణ కార్యక్రమం), డాక్టర్. తన్వీర్ రిజ్వానా( జిల్లా ఇమ్మ్యూనై  జైషన్ అధికారి), కే మధుసూదన్ రెడ్డి, తిరుమలేష్ రెడ్డి,వరలక్ష్మి, నరేంద్రబాబు మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State