వైద్య విద్యను అభ్యసించాలి ప్రజలకు సేవ చేయాలి

Sep 30, 2026 - 21:11
 0  1
వైద్య విద్యను అభ్యసించాలి ప్రజలకు సేవ చేయాలి

 తిరుమలగిరి 01 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

విద్యార్థినిలు పట్టుదలతో వైద్య విద్యను అభ్యసించి సమాజానికి సేవ చేయాలని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం తిరుమలగిరి అధ్యక్ష, కార్యదర్శులు ఎస్ విటల్ రెడ్డి, బి నర్సయ్య కోరారు. బుధవారం పెన్షనర్స్ భవన్ తిరుమలగిరిలో 2026 నీట్ లో ఎంబిబిఎస్ సీట్లు సాధించిన జలాల్ పురం గ్రామానికి చెందిన ముత్తినేని వైష్ణవి రిమ్స్ ఆదిలాబాద్, జేత్యా తండాకి చెందిన ధరావత్ అలేఖ్య ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వనపర్తిలను శాలువా, మెమోంటోలచే ఘనంగా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం తిరుమలగిరి మండల శాఖ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు విటల్ రెడ్డి చెరో పది వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మందడి పద్మారెడ్డి, కోశాధికారి చిత్తలూరి పుల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు చెట్టిపల్లి మల్లయ్య, కేసిడి రామిరెడ్డి, ఉప్పల పద్మమ్మ, కె పుష్పలీల, కె రాములు, కె కొమిరెల్లి, పి సత్యనారాయణ తదితర పెన్షనర్లు, బంధువులు పాల్గొన్నారు... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి