విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలి. ప్రజావాణిలో ఈ విద్యుత్ పైన ఎక్కువ ఫిర్యాదు లు
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.
జోగులాంబ గద్వాల7 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : విద్యుత్ సరఫరా లో అధికారులు చిత్తశుద్ధితో పనిచేసే కరెంటు అంతరాయం లేకుండా సరఫరా చేయాలని జోగులంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్ అన్నారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి విద్యుత్ సమస్య పైన ఎక్కువ ఫిర్యాదులు అందాయని సమస్య లేకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.
ప్రజావాణికి వచ్చే ఆర్జీలను పెండింగ్ లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సంబంధిత శాఖ అధికారులను కోరారు.
జిల్లాలోని ఐడిఓసి సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మధుమోహన్, నర్సింగరావు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు మనోజ్ కుమార్ రెడ్డి, రాజ్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. ఈ వారం మొత్తం 34 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. జిల్లా స్థాయి ప్రజావాణిలో 98, మండల స్థాయి ప్రజావాణికి వచ్చిన 247 ఆర్జీలు పెండింగ్ లో ఉన్నాయని వీటన్నింటిని ఆయా శాఖల అధికారులు సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజావాణికి ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని, చీఫ్ సెక్రటరీ స్థాయిలో కూడా రివ్యూ చేస్తుండడంతో అలసత్వం వహించడం సరికాదన్నారు. విద్యుత్ శాఖ పైనే అనేక రకాల సమస్యల పైన వస్తున్నాయని, ఎస్ఈ, డిఈ, ఏడిఈ, ఏఈ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించాలన్నారు. పలు సబ్ స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరాలో అంతరాయంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని. ఇటీవల అనేక ఘటనలు. చోటు చేసుకోవడంతో సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉంటూ నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చిత్తశుద్ధితో పనిచేయాలని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో మంజుల, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.