విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు మృతి

HYD: నగరంలో మరో విషాదం చోటు చేసుకుంది. పాతబస్తీలో ట్రాక్టర్పై భారీ వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తుండగా హై టెన్షన్ విద్యుత్ వైర్లు తగలడంతో ఇద్దరు యువకులు మృతి చెందగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు టోని(21), వికాస్(20)గా గుర్తించారు. కరెంటు షాక్తో ట్రాక్టర్ టైర్లు పూర్తిగా కాలిపోయాయి. దీంతో క్రేన్ సహాయంతో వినాయక విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించారు.