విద్యుత్ మీటర్ రీడర్ కార్మికులు ఇంద్ర పార్క్ వద్ద మహాధర్నా

Mar 2, 2026 - 21:09
Mar 2, 2026 - 21:10
 0  5
విద్యుత్ మీటర్ రీడర్ కార్మికులు ఇంద్ర పార్క్ వద్ద మహాధర్నా

సూర్యాపేట 02 మార్చి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– సూర్యాపేట జిల్లాకు చెందిన విద్యుత్ మీటర్ రీడర్ కార్మిక సంఘం అధ్వర్యంలో  న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సోమవారం హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్మ పోరాటం లో సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ, హుజూర్ నగర్ డివిజన్ ల నుండి దాదాపు 230  మంది బయలు దేరినారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేశ్వర్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2500 మంది మీటర్ రీడర్ కార్మికులు గత 20 సంవత్సరాలుగా విద్యుత్ శాఖకు వెన్నుదన్నుగా ఉంటూ కరెంట్ బిల్లుల రీడింగ్ చేస్తూ విద్యుత్ శాఖకు సేవలందిస్తున్నారు.కానీ సమాన పనికి సమాన జీతం లేక మా మీటర్ రీడర్ కార్మికుల బతుకులు అత్యంత దారుణంగా వర్ణరహితంగా ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.  నెలరోజుల పని దినాలు కల్పించి మీటర్ రీడర్లకు కనీస వేతనం ఇవ్వాలని అర్హతను బట్టి సబ్స్టేషన్ ఆపరేటర్లుగా నియమించి  ఆర్టిజన్ గా గుర్తించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో డివిజన్   చిలుక శ్యామ్, మద్దెల సాయికుమార్, పాల్వాయి సతీష్, మోరు రాంబాబు, శ్రీనివాస్ రెడ్డి, దుర్గాప్రసాద్, గణేష్, సాయి, విష్ణు, నాగరాజు, మహేష్, తదితర కార్మికులు పాల్గొన్నారు.