విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.
సన్ ప్రీత్ సింగ్ , ఎస్పి సూర్యాపేట జిల్లా.

మంచి భవిష్యత్తుకై పట్టుదలతో కృషి చేయాలి.
...సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా.
సూర్యాపేట, 5 మార్చి 2025 తెలంగాణవార్త ప్రతినిధి:- ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయం నందు సువెన్ ఫార్మా కంపెనీ ట్రస్ట్, అక్షర ఫౌండేషన్ అధ్వర్యంలో నిర్వహించిన పేద విద్యార్థులకు స్కాలర్షిప్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి జిల్లా ఎస్పి ముఖ్య అతిథిగా హాజరైన చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ పేద విద్యార్థులను ఆర్థికంగా ఆదుకోవడం మంచి విషయం అని అన్నారు. విద్యార్థులు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకొని లక్ష్యంతో కష్టపడి చదువుకోవాలని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తున్ననాని అన్నారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ మంచి అలవాట్లతో లక్ష్యం వైపు పట్టుదలతో కృషి చేయాలని కోరారు.
కార్యక్రమంలో ఎస్పీ గారి వెంట అదనపై ఎస్పీ నాగేశ్వరరావు, సువిన్ ఫార్మా వైస్ ప్రెసిడెంట్ రమేష్ బాబు, హెచ్ ఆర్ మేనేజర్ వెంకటరమణ, మేనేజర్ సైదులు అక్షర ఫౌండేషన్ రామ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.