వాహనదారులకు ప్రమాదంగా మారిన ఫ్లెక్సీ లు
జోగులాంబ గద్వాల 26 జూన్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ నుంచి కృష్ణవేణిచౌకి వరకు వాహనదారులకు ప్రమాదకరంగా ఉన్నాయి ఫ్లెక్సీలు. బైక్ లపై వెళ్లే ప్రయాణికులకు మరియు స్కూల్ బస్ విద్యార్థులకు వాహనదారులకు ఫ్లెక్సీలు ఇబ్బందికరంగా ఉన్నాయని, బైక్ పై వెళ్లేటప్పుడు పొరపాటున తగలరాని చోట కండ్లకు తగలడం, దుస్తులకు తగలడం, ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు స్పందించి ప్రమాదాలు జరగక ముందే అట్టి ప్లెక్సీలను తొలగించాలని పట్టణ ప్రజలు వాహనదారులు కోరుతున్నారు.