వారసత్వ భూమిని కబ్జా చేశారని వృద్ధురాలి ఆవేదన
సూర్యాపేట జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం
సూర్యాపేట: తనకు వారసత్వంగా రావాల్సిన భూమిని కొందరు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని కబ్జా చేశారని ఆరోపిస్తూ 78 సంవత్సరాల వృద్ధురాలు లాల్ సాబ్, జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. వినతిపత్రంలో పేర్కొన్న వివరాల ప్రకారం, పెన్బాడ్ మండలం చీదెళ్ల గ్రామానికి చెందిన షేక్ నాసర్, తండ్రి లాల్ సాబ్ , చీదెళ్ళ గ్రామ రెవెన్యూ శివారులో మా పూర్వీకుల ద్వారా సర్వే నంబర్లు 519, 520 ,లోని భూమిలో తన పూర్వీకుల నుంచి వారసత్వ వాటాగా 16 ఎకరాల భూమి రావాల్సి ఉందని తెలిపారు. అయితే కొందరు వ్యక్తులు తన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని కబ్జా చేశారని ఆమె ఆరోపించారు. ఈ విషయంపై సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ తగిన న్యాయం జరగలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన భూమికి సంబంధించిన రికార్డులను పరిశీలించి, అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగి ఉంటే వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే తనకు వారసత్వంగా రావాల్సిన భూమిని తిరిగి ఇప్పించి న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ను వినతిపత్రం ద్వారా కోరారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని వృద్ధురాలు విజ్ఞప్తి చేశారు.