వస్త్రం తండా ప్రజలకు పునరావాసం కల్పించండి...

Jul 21, 2026 - 00:21
Jul 21, 2026 - 00:24
 0  2
వస్త్రం తండా ప్రజలకు పునరావాసం కల్పించండి...

జనవాసాలకు దూరంగా ఫార్మాను తరలించాలి..

తండా ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న కోహెన్స్ ఫార్మా.....

సిపిఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు డిమాండ్..

కోహెన్స్ (సువెన్ ) ఫార్మ నుంచి వచ్చే విషవాయువులతో వస్త్రం తండా ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని వారికి వెంటనే పునరావాసం కల్పించి వారిని ఆదుకోవాలని సిపిఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ డే లో జాయింట్ కలెక్టర్ కి వస్త్రం తండా ప్రజలతో కలిసి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫార్మా నుంచి వచ్చే నీరును విడుదల చేయటం వల్ల భూగర్భ జలాలని కలుషితమైన నీరు తాగటం వల్ల పిల్లలు పెద్దలు మహిళలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు చెప్పినా ఫార్మా కంపెనీ యజమాన్యం నిర్లక్ష్యంగా వహిస్తున్నారని కలెక్టర్ ఫార్మా కంపెనీపై, యజమాన్యంపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తండావాసులు సేవ్య, అశోక్, తారా సింగ్, పరమేష్, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333