వర్షాల కారణంగా నేల పాలైన వరి ధాన్యం.. నష్టపోయిన పత్తి రైతులు
అడ్డగూడూరు 30 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:– మొంథా తుపాను కారణంగా అడ్డగూడూరు మండలంలోని అడ్డగూడూరు మండల కేంద్రంలోని వివిధ గ్రామంలో రైతులతో సహా ఆసర్ల బీరుమల్లు కౌలు రైతు15ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తుండగా తుఫాన్ కారణంగా చేతికొచ్చిన వరి పంట పూర్తిగా నీట మునగడంతో పూర్తిగా నష్టపోయిన రైతు మండలంలోని వివిధ గ్రామాలలో 2వేల పైచిలుకు ఎకరాల పంట నష్టం జరగడంతో తీవ్రంగా నష్టపోయిన రైతులు. దళారుల వ్యవస్థ ఒకవైపు ఆరుగాలం పండించిన పత్తి ఐకెపి సెంటర్లో పోసిన వరి ధాన్యం తడిసి మొలకెత్తడంతో రైతులలొ దిక్కుతోచని పరిస్థితి మండలంలోని అధికారులు నష్టపోయిన రైతులను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం పంట నష్ట పరిహారం క్రింద తక్షణమే రైతులను ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాము. రైతు ప్రభుత్వం చెప్పుకునే ఈ ప్రభుత్వం రైతులను విస్మరిస్తుంది ప్రభుత్వ ఏర్పడక ముందు కౌలు రైతులకు మరియు రైతులకు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరిచిపోయింది ప్రభుత్వం రైతులపై ప్రత్యేక శ్రద్ధ చూపి వారి సమస్యలను పరిష్కరించాల బిజెపి పార్టీ డిమాండ్ చేస్తున్నామని అన్నారు.