వర్షం కోసం కృష్ణా జలాలతో అభిషేకాలు
జోగులాంబ గద్వాల 27 జూన్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- వర్షాకాలం ప్రారంభమైన నేటికి వర్షాలు రాకపోవడంతో జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలంలోని శెట్టి ఆత్మకూర్ రైతన్నలు ఎద్దుల బండ్లతో శనివారం శెట్టి ఆత్మకూర్ గ్రామ నుంచి ఎడ్ల బండ్లు మరియు గ్రామ రైతులు యువకులు గ్రామం నుంచి నడుచుకుంటూ భక్తిశ్రద్ధలతో భజన చేసుకుంటూ కృష్ణానది వరకు వెళ్లి నదిలో బిందెలలో నీళ్లు తీసుకొని జలాలతో దేవత విగ్రహాలకు అభిషేకాలు ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువకులు గ్రామ రైతులు తదితరులు ఉన్నారు.