వరి కొయ్యలకు నిప్పు పెట్టొద్దు

May 30, 2026 - 20:02
 0  0
వరి కొయ్యలకు నిప్పు పెట్టొద్దు

  తిరుమలగిరి 31 మే 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

తిరుమలగిరి మండలంలోని తొండ గ్రామంలో వరి పొలాలలోని వరికొయ్యలకు నిప్పు పెట్టడం వలన జరిగే నష్టాల గురించి అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి నాగేశ్వరరావు మరియు ఎస్ఐ వెంకటరెడ్డి తహసిల్దార్ హరిప్రసాద్ మాట్లాడుతూ, వరి పొలాలలోని వరి కొయ్యలను తగలబెట్టడం వలన భూమిలో భూసారం తగ్గిపోతున్నది, అట్టి మంటల వలన చుట్టుపక్కల ఉన్న రైతుల వరి పొలాలకు వ్యాపించి వారి యొక్క కరెంటు మోటార్ స్టార్టర్లు, పైపులు మొదలైనవి కాలిపోయి నష్టం జరగుతున్నది, కాబట్టి రైతులు వరికొయ్యలకు నిప్పు పెట్టవద్దని సూచన చేసి రైతులకు అవగాహన సదస్సు నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో తొండ గ్రామ సర్పంచ్ స్వాతి భాస్కర్, కార్యదర్శి యాకూబ్ ,జిపిఓ ఇస్మాయిల్ గ్రామ ప్రజలు రైతులు తదితరులు పాల్గొన్నారు... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి