వరదప్రవాహం లేక కళ తప్పిన నిజాం కొండ ఖిల్లా

Jul 2, 2026 - 19:54
 0  2
వరదప్రవాహం లేక కళ తప్పిన నిజాం కొండ ఖిల్లా

జోగులాంబ గద్వాల 2 జూలై 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి :  ఇటిక్యాల. నేషనల్ హైవే 44వ జాతీయ రహదారి ప్రక్కన బీచుపల్లి సమీపంలో, కృష్ణా నది మధ్యలో ప్రకృతి అందాల నడుమ వెలిసిన చారిత్రాత్మక 'నిజాం కొండ ఖిల్లా' ప్రస్తుతం వరద నీరు లేక పూర్తిగా కళ తప్పింది. ఏటా వర్షాకాలంలో ఎగువ నుంచి వచ్చే భారీ వరదలతో కృష్ణా నది నిండుగా ప్రవహిస్తున్నప్పుడు, ఈ ఖిల్లా చుట్టూ నీరు చేరి ఒక అద్భుతమైన దీవిలా మారి పర్యాటకులను కట్టిపడేసేది.

జాతీయ రహదారి గుండా వెళ్లే ప్రయాణికులు, బీచుపల్లి క్షేత్రానికి వచ్చే భక్తులు సాధారణంగా నది మధ్యలో జలకళతో మెరిసిపోయే ఈ కోటను చూసి ఆనందించడానికి ఇష్టపడతారు. కానీ, ఇప్పుడు నీరు లేక ఎడారిలా మారిన నదిని, కళ తప్పిన కొండను చూసి పర్యాటకులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఎగువ నుంచి వరద నీరు వచ్చి చేరితే తప్ప ఈ నిజాం కొండ ఖిల్లాకు మళ్లీ పూర్వపు వైభవం, ఆ జలకళ వచ్చేలా లేదు అని ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333