తాసిల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు
జోగులాంబ గద్వాల 2 జులై 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల. తాసిల్దార్ కార్యాలయం అధికారుల కోసం స్థానికులు పళ్ళు రకాల సమస్యల కోసం ప్రదక్షిణలు చేసిన సమస్యలు పరిష్కార కావడం లేదని స్థానికులు వాపోతున్నారు. గురువారం తాసిల్దార్ కార్యాలయంలో జనాల సందడితో నిండిపోయింది. సమీప గ్రామాల్లోని ప్రజలు వివిధ రకాల ధ్రువీకరణ పత్రాల కోసం నిత్యం అధికారుల చుట్టూ తిరిగిన పనులు కావడంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. పై చదువుల కోసం విద్యార్థులు. భూమి రిజిస్ట్రేషన్ కోసం రైతులు. అంగన్వాడీ పోస్టుల దరఖాస్తుల కోసం. కులము ఆదాయము స్థానిక ధ్రువపత్రాలు. తదితర అవసరాల నిమిత్తం ఎస్సీ బి సి మైనార్టీ వర్గాల్లోని అడ్మిషన్ల ల కోసం వివిధ రకాల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ నిబంధనల మేరకు గడువు విధించడంతో అధికారులు ఆలస్యం చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ధరూరు మండలంలోని నీలహ లి గ్రామంలోని జనన ధ్రువీకరణ పత్రం కోసం హైదరాబాదు నుంచి అధికారులు లేక పోవడంతో పని కాలేదని ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వారు తెలిపారు. ఇలాగ అనేకమంది పలు సమస్యల కోసం అధికారుల కోసం పడి కాపులు కలిసిన పరిస్థితి ఏర్పడింది. దూర ప్రాంతాల నుంచి ఆకలి దప్పికలు కలుకొని జేబు కాళీ చేసుకుని తిరిగేలా పరిస్థితి ఏర్పడిందని పలువురు పేర్కొన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ చర్యలు తీసుకొని ధ్రువీకరణ పత్రాలు జారీలో ఇబ్బందులు లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.