ర రైతు వేదికలో రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్

Jun 18, 2024 - 18:46
Jun 18, 2024 - 20:42
 0  10
ర రైతు వేదికలో రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్

వేదికలో రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్

తెలంగాణవార్త:- పెన్ పహాడ్ మండల కేంద్రంలో ఈరోజు రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా వానాకాలంలో వరి పంటలో మెలకువలు గురించి డాక్టర్ ఎల్ కృష్ణ గారు ప్రధాన శాస్త్రవేత్త (వరి) వివరించడం జరిగింది అదేవిధంగా డాక్టర్ నగేష్ కుమార్ గారు ప్రధాన శాస్త్రవేత్త మొక్కజొన్న పంటలో మెలకువలు గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా ఆర్గానిక్ వరి వ్యవసాయంలో ఐ సి ఏ ఆర్ అవార్డు గ్రహీత రైతు శ్రీమతి లావణ్య గారు నాగర్ కర్నూల్ జిల్లా నుంచి వారి యొక్క అనుభవాలను తెలియజేయడం జరిగింది తర్వాత సంగారెడ్డి జిల్లా జి జనార్ధన్ అనే రైతు వరి సాగులో వారి యొక్క అనుభవాల గురించి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో రైతులు శాస్త్రవేత్తల యొక్క సూచనలు సలహాలు పాటించి అధిక దిగుబడి పొందాలని సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి జి శ్రీధర్ రెడ్డి గారు పాల్గొన్నారు మరియు మండల వ్యవసాయ అధికారి బి.కృష్ణ సందీప్, క్లస్టర్ ఏ ఈ ఓ డి.సంధ్య సూర్యపేట డివిజన్ వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు మరియు రైతులు ఎర్రంశెట్టి మురళి, ధరావత్ నగేష్ , రంగినేని శంకరయ్య, రమేష్ , భూక్య లాలు పాల్గొనడం జరిగింది

Harikrishna Penpahad Mandal Reporter Suryapet Dist Telangana State