రోడ్డు ప్రమాదాల నిర్ములనే లక్ష్యం.
ప్రజల ప్రాణ భద్రతను ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని సోమవారం నుండి జిల్లాలో వారం రోజుల పాటు రెండవ దశ “అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పి నరసింహ తెలిపినారు. రోడ్డు ప్రమాదాలను నిర్మూలించడం, ప్రతి ఒక్కరూ సురక్షితంగా గమ్యం చేరడం, ట్రాఫిక్ నియమాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని తెలిపారు. ఈమేరకు సిబ్బందికి ఆదేశాలు, ప్రణాళిక జారీ చేయడం జరిగినది అన్నారు. దీనిలో భాగంగా జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృత ప్రచారం చేస్తాము, ప్రజలకు ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతపై ప్రకటనలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది, హెల్మెట్ ధరించడం, సీట్‌బెల్ట్ వినియోగం, మితిమీరిన వేగం నివారణ, మద్యం సేవించి వాహనం నడపకూడదనే అంశాలపై ప్రతి రోజు ఒక కార్యక్రమం నిర్వహించి ప్రజలను, విద్యార్థులను, యువతను, డ్రైవర్ లను చైతన్య కలిగిస్తం అన్నారు.
ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలి, “సురక్షితంగా వెళ్లి సురక్షితంగా చేరడం” ప్రతి పౌరుడి బాధ్యత అని తెలియ జేశారు.