రోడ్డుపై మురుగునీరు
పట్టించుకోని అధికారులు ప్రజాప్రతినిధులు.
ప్రజల నుంచి విమర్శలు
జోగులాంబ గద్వాల 18 జూన్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ఇటిక్యాల . మండలం పరిధిలోని బుండారెడ్డిపల్లి గ్రామంలో నడి ఊర్లోని మెయిన్ రోడ్డుపై ప్రజలు నీటిని వదలడం వలన నడి ఊరులో మెయిన్ రోడ్డు లోగుంతలలో మురుగునీరు నిలవడం వలన గ్రామ ప్రజల రాకపోకలకు చాలా ఇబ్బందుల కు గురవుతున్నామని ప్రజల నుంచి విమర్శలు వెలుగుతున్నాయి. ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు ఇంకుడు గుంతలు చేసుకుని ఉంటే ఈ సమస్య ఉండేది కాదని కాలనీవాసుల నుంచి విమర్శలు వస్తున్నాయి.?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని అధికారులకు ఆదేశాలు ఉన్నప్పటికీ క్రిందిస్థాయి అధికారులు మాత్రం నిమ్మకు నేరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ప్రజల నుంచి విమర్శలు వెలివెత్తుతున్నాయి.? వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని రోడ్డుపై మురుగు నీరు ఉన్న దగ్గర కనీసం బ్లీచింగ్ పౌడర్ అయినా చల్లాలని గ్రామ ప్రజలు సంబంధిత అధికారులని ప్రజాప్రతినిధులను కోరుతున్నారు.? గ్రామ సర్పంచ్ పంచాయితీ కార్యదర్శి ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.