రైతుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న రేవంత్ రెడ్డి సర్కార్
పండించిన పంటను కొనలేని చేతకాని ప్రభుత్వం కాంగ్రెస్.
కాంటవేసిన మొక్కజొన్నలను గోదాములకు తరలించలేని దద్దమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్.
బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య
తక్షణమే కాంటవేసిన మొక్కజొన్నలను గోదాములకు తరలించాలి లేనిపక్షంలో పెద్ద ఎత్తున రైతుల పక్షాన నిరాహార దీక్షలు చేస్తాం.
జోగులాంబ గద్వాల 8 మే 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : అలంపూర్. నియోజకవర్గం, ఐజ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ లో మొక్కజొన్న రైతులు పడుతున్న కష్టాలను చూసి వారి దగ్గరికి వెళ్లి మొక్కజొన్న రైతులను పరామర్శించిన రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్య*
ఈ సందర్బంగా రైతులతో కలిసి బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్య మాట్లాడుతూ...
* రైతు పండించిన మొక్కజొన్న పంటను మార్కెట్ యార్డ్ కి తీసుకొచ్చి 20 రోజులు అయితే కూడా గోదాములకు తరలించలేని చేతగాని ప్రభుత్వం.
* తక్షణమే అధిక మొత్తంలో లారీలను పెట్టి మొక్క జొన్న దాన్యం ను గోదాములకు తరలించాలి.
* మార్కెట్ యార్డ్ ల లోనే రైతులు రాత్రింబవళ్లు కళ్ళలో కన్నీళ్లు కారుస్తూ పంటను చూసుకుంటా నిద్రపోతున్నారు.
* అక్కడనే మార్క్ఫెడ్ ఎండి తో చరవాణి లో మాట్లాడుతూ తక్షణమే కాంటా వేసిన మొక్కజొన్నలను గోదాములకు తరలించాలని డిమాండ్ చేశారు. లేని పక్షం లో పెద్ద ఎత్తున రైతులతో కలిసి పోరాటం చేస్తామని డిమాండ్ చేసారు.
* యంత్రాంగం మొక్కజొన్నలను మీ వాహనాలను పెట్టి గోదాములకు తరలించుకోండి అని చెప్పడం దుర్మార్గం.
* ఐజ మార్కెట్ యార్డ్ లో 80 వేల క్వింటాలకు పైగా మొక్కజొన్నలు ఉన్నాయి.
* వాటిని తక్షణమే గోదాములకు తరలించకపోతే పెద్ద ఎత్తున నిరాహార దీక్షలు చేస్తామని డిమాండ్ చేశారు.
* మొక్కజొన్న మార్కెట్ లలో రాలిపోతున్న రైతులు. కనీసం చలనం లేని మోసపూరితమైన ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్.
* రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు
* ధాన్యం కొనుగోలు చేయలేక ప్రభుత్వం నాటకాలు ఆడుతోంది
* రేవంత్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది
* కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ రైతుబంధును సమయానికి వేయలేదు
* రైతులకు మాయమాటలు చెప్పి కాంగ్రెస్ మోసం చేసింది
* రైతులకు సమయానికి రైతుబంధు వేసిన చరిత్ర కేసీఆర్‌ది
* ప్రభుత్వం పంటలను కొనకుండా అన్నదాతలను వేధిస్తోంది
* ఎలాంటి ఆంక్షలు లేకుండా పంటలను కొన్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే
* ఎలాంటి షరతులు లేకుండా ఈ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలి
* పంట కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు చనిపోతున్నారు
* రైతులు చనిపోవడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వమే.
* ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే.. రైతుల మృతికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి.
రైతులకు వరంగల్ లో ఇచ్చిన డిక్లరేషన్ లో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేని మోసపూరితమైన కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీటీ దొడ్డి మాజీ సర్పంచ్ డాక్టర్ శివకుమార్ మరియు రైతులు వీరేష్ ఉత్తనూర్ గోవింద్ రమేష్ నరేష్ ఎల్లప్ప పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.