రేపు కలెక్టర్ ఆధ్వర్యంలో జరగబోయే సమావేశానికి రైతులు హాజరుకావాలి
- సీడ్ కంపెనీ మరియు ఆర్గనైజర్ల ద్వారా మోసపోయిన రైతులందరూ సమావేశానికి హాజరుకావాలని పిలుపునిచ్చిన..
-NHPS జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్..
జోగులాంబ గద్వాల 12 జూన్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి: గద్వాల: జిల్లా కేంద్రంలోని రేపు జిల్లా కలెక్టర్ సమక్షంలో రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి ఆధ్వర్యంలో జరగబోయే సీడ్ పత్తి రైతుల సమావేశంలో కంపెనీ మరియు ఆర్గనైజర్ల ద్వారా మోసానికి గురై నష్టపోయిన విత్తనపత్తి రైతులు అందరూ రేపు జరగబోయే సమావేశంలో పాల్గొనాలని నడిగడ్డ హక్కుల పోరాట సమితి కార్యాలయంలోని జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ విలేఖర్ల సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....
విత్తనపత్తిని సాగు చేస్తూ ఆర్గనైజర్లు మరి కంపెనీ చేతిలో మోసపోయి నష్టపోయిన విత్తనపత్తి రైతుల సమస్యలపై జిల్లా కలెక్టర్ గారికి గత కొద్ది రోజుల క్రితం నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సీడ్పత్తి రైతులతో కలిసి వినతి పత్రం అందజేసి సీడ్ పత్తి రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరగా కంపెనీలు మరియు ఆర్గనైజర్ల, రైతులతో కలిసి సమావేశం నిర్వహిస్తామని తెలిపినట్లు ఆయన తెలిపారు.
నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సిడి పత్తి రైతుల తరఫున కంపెనీ మరియు ఆర్గనైజర్లు చేస్తున్న మోసాలపై గత దశబ్దాల నుండి రైతుల పక్షాన పోరాటం చేస్తున్నామని తెలిపారు. రైతులతో ఒప్పందాలు చేసుకొని,పెరిగిన పెట్టుబడికి అనుగుణంగా రేట్లు పెంచాలని జీఓటి ఫలితాల్లో అవకతకాలను నిరోధించి,దూదిని రైతుల ఎదురుగా తూకం వేయాలని
మార్కెట్ రేట్ల ప్రకారం రైతులకు రేటు ఇవ్వాలని,విత్తన పత్తి పంటకు ఇచ్చిన అడ్వాన్స్ పై వడ్డీలు వసూలు చేయకూడదన్నారు.
అక్రమంగా రైతుల భూములను దౌర్జన్యంగా గుంజుకోవడం మానుకొని,జీవోటీ ఫలితాలు వచ్చిన రెండు నెలల లోపే రైతులకు పేమెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రైతులతో ఒప్పందాలు చేసుకొని పెరిగిన పెట్టుబడికి అనుగుణంగా రేట్లు పెంచాలి.*
డీమాండు
- జీఓటి ఫలితాల్లో అవకతకాలను నిరోధించి,దూదిని రైతుల ఎదురుగా తూకం వేయాలి.
- అక్రమంగా రైతుల భూములను దౌర్జన్యంగా గుంజుకోవడం మానుకోవాలి.
- జీవోటీ ఫలితాలు వచ్చిన రెండునెలల లోపే పేమెంట్ ఇవాలి..
కావున రేపు జరగబోయే ఈ సమావేశానికి ఆర్గనైజర్ల ద్వారా మోసపోయి నష్టానికి గురైన విత్తనపత్తి రైతులు అందరూ రేపు జరగబోయే సమావేశానికి రైతులు తప్పకుండా హాజరుకావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి గద్వాల మండల నాయకులు గౌని శ్రీనివాస్ యాదవ్, సీనియర్ నాయకులు మీసాల కిష్టన్న, దొడ్డన్న, గోపాల్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.